నాగ చైతన్య ని ప్రేమించి.. పెళ్లాడిన సమంత అక్కినేని ఇంటి కోడలిగా బరువు బాధ్యతలు స్వీకరించింది. కొన్నాళ్ళు సజావుగా జరిగిన కాపురాన్ని వదులుకుని నాగ చైతన్య కి విడాకులు ఇచ్చి అక్కినేని పేరుని వదిలేసి.. ఆ కాంపౌండ్ నుండి కాలు బయటపెట్టింది సమంత. తర్వాత చైతు వేరే ఫ్లాట్ కి మారిపోగా.. సమంత మాత్రం చైతు తో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుంది. ఇక నాగ చైతన్య బర్త్ డే కి కూడా విష్ చెయ్యని సమంత ని చూస్తే అక్కినేని ఫాన్స్ కి కోపంగానే ఉంది. అయితే నాగ చైతన్యకి విడాకులిచ్చి అక్కినేని పేరుని వదిలేసినా.. సమంత మాత్రం అన్నపూర్ణ అదేనండి అక్కినేని కాంపౌండ్ ని వదల్లేదు. అంటే వృత్తి రీత్యా సమంత అక్కడికి వెళ్లినా.. అందరూ చైతూని వదిలేసినా.. సమంత అక్కినేని కాంపౌండ్ ని వదల్లేదు అంటున్నారు.
నాగ చైతన్యతో తో విడాకుల తర్వాత కెరీర్ మీద, మనీ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టిన సమంత శాకుంతలం మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఒప్పుకుంది. అంతేకాదు భారీ పారితోషకానికి పాన్ ఇండియా ఫిలిం పుష్ప లో ఐటెం సాంగ్ చేస్తుంది. అంతేకాదు.. బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమంటూ ప్రకటించేసింది.. సో కెరీర్, మనీ అంటూ పరుగులుపెడుతున్న సమంత మళ్ళీ అక్కినేని కాంపౌండ్ లోకి ఎందుకు కాలు పెట్టింది అంటే.. శాకుంతలం సినిమాకి సమందించిన డబ్బింగ్ కార్యక్రమాల కోసం సమంత అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదండి మేటర్.