ఇండస్ట్రీలో దగ్గుబాటి బ్రదర్స్ లో వెంకటేష్ హీరో అయితే.. సురేష్ బాబు నిర్మాతగా చక్రం తిప్పుతున్నారు. ఇక అన్నదమ్ములు ఇద్దరూ అనుకున్నారు అంటే సక్సెస్ సాధించినట్టే. ఏ భాషలో అయినా ఓ సినిమా హిట్ అయ్యి.. అది వెంకటేష్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనుకుంటే.. దానిని రీమేక్ చెయ్యడానికి రాత్రికి రాత్రే రంగం సిద్ధం చేసేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా నారప్ప, దృశ్యం సినిమాలే కాదు.. గతంలోనూ వెంకటేష్ వరస రీమేక్స్ తో హిట్స్ కొట్టాడు. ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ హీరోల దగ్గర లేని హిట్స్ వెంకీ ఖాతాలో ఉన్నాయి. దృశ్యం, గురు, నారప్ప ఇప్పుడు దృశ్యం 2 ఇలా వరసగా హిట్స్ కొట్టాడు. నాగార్జున, బాలకృష్ణ వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతుంటే.. వెంకీ మాత్రం రీమేక్ లతో హిట్స్ అందుకుంటున్నాడు.
నిన్నటికి నిన్న తమిళ అసురన్ ని నారప్ప గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇక తాజాగా మలయాళంలో హిట్ అయిన దృశ్యం 2 మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సాయంత్రానికే.. వెంకటేష్, సురేష్ బాబులు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు. నారప్ప విషయంలోనూ అన్నదమ్ములు ఇలానే ప్లాన్ చేసారు. అయితే అమెజాన్ ప్రైమ్ లో మోహన్ లాల్ దృశ్యం 2 హిట్ అయ్యింది. మళ్లీ వెంకీ అదే సినిమాని రీమేక్ చెయ్యడం ఎందుకు.. ఆల్రెడీ అందరూ అమెజాన్ ప్రైమ్ లో మోహన్ లాల్ దృశ్యం 2 చూసేసారు.. ఇక తెలుగు దృశ్యం 2 ఎందుకు అన్నారు.. అయినా వెంకీ, సురేష్ బాబులు తగ్గలేదు, వెనకడుగు వెయ్యలేదు. అనుకున్నట్టుగా రీమేక్ చేసి ఓటిటి రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టేసారు. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన వెంకీ దృశ్యం 2 కి అదరగొట్టే టాక్ పడింది.