రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుంది. దానితో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది టీం. ఇప్పటికే దోస్తీ, నాటు నాటు సాంగ్స్ సోషల్ మీడియాని ఊపెయ్యగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్ సోల్ ఆంథెమ్ కూల్ గా ఎక్కేస్తుంది. రాజమౌళి ప్రత్యేకంగా ఆర్.ఆర్.ఆర్ సోల్ ఆంథెమ్ ని హైదరాబాద్, చెన్నై లలో ప్రెస్ మీట్స్ పెట్టి అంచనాలు పెంచేశారు. ఇక తాజాగా ఆర్.ఆర్.ఆర్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ సినిమా టోటల్ రన్ టైమ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సెన్సార్ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అఫీషియల్ గా ఆర్.ఆర్.ఆర్ సెన్సార్ విషయం బయటికి వచ్చేవరకు.. వీటన్నిటిని నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ హీరోలైన ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్స్ లో ఉండగా.. రామ్ చరణ్ మాత్రం తన తదుపరి మూవీ RC15 షూటింగ్ లో పాల్గొంటున్నాడు.