కిట్టి పార్టీల పేరుతో సెలబ్రిటీస్ తో పరిచయాలు పెంచుకుని వారిని చీట్ చేస్తున్న శిల్పా చౌదరీ మహిళా పై పోలీస్ కేసు పెట్టడం ఇప్పుడు హాట్ హాట్ చర్చలకు దారితీసింది. అలా కిట్టి పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి ఆ తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఇస్తూ కనిపించకుండా మాయమైపోతున్న శిల్పా చౌదరిపై లెక్కల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసులో శిల్పా చౌదరీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం కలకలం రేగింది.
శిల్పా చౌదరీ కొన్నాళ్లుగా హైదరాబాద్ కాస్ట్లీ ఏరియాల కి చెందిన గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ లాంటి నగరాల్లో హైఫై ఫామిలీస్ లేడీస్ తో కిట్టి పార్టీల ఏర్పాటు చెయ్యడమే కాకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుని.. తాను సినిమా ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ నంటూ అందరికి కలరింగ్ ఇచ్చి ఆ కిట్టి పార్టీకి వచ్చిన వారి నుంచి అపుడప్పుడు ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.
అయితే తాజాగా రోహిణి అనే మహిళా నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరి కి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రోహిణి అనే మహిళా తన దగ్గర కేవలం నాలుగు కోట్లే అని, చాలామంది దగ్గర శిల్పా చౌదరి వందల కోట్లు తీసుకుని మోసం చేసిందిగా అంటూ ఆమె పోలీస్ లకి చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రోహిణి మత్రమే కాకుండా.. శిల్పా చౌదరి పై కేసులు పెడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఆమె పై చీటింగ్ కేసులు పెట్టడానికి నార్సింగి పోలీస్ స్టేషన్ కు బాధితులు తరలి వస్తున్నారని వారి వద్ద నుంచి వివరాలు సేకరించి మరింత సమాచారాన్ని తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.