Advertisementt

పెళ్లి కాకుండానే కొత్తింటికి నయన్ - విగ్నేష్

Sat 27th Nov 2021 07:41 PM
nayanthara,vignesh shivan,nayan purchase luxury house,poes garden,chennai  పెళ్లి కాకుండానే కొత్తింటికి నయన్ - విగ్నేష్
Nayanthara and Vignesh Shivan purchase luxury house in Poes garden పెళ్లి కాకుండానే కొత్తింటికి నయన్ - విగ్నేష్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి డిసెంబర్ లో జరగబోతుంది అనే ప్రచారం ఉన్నప్పటికీ.. అటు నయన్ కానీ, ఇట్ విగ్నేష్ శివన్ కానీ పెళ్లి విషయం కంఫర్మ్ చెయ్యడం లేదు. ప్రస్తుతం విగ్నేష్ దర్శకుడిగా నయన్ సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గాను, నిర్మాతగానూ నయనతార ఫుల్ బిజీ తార. అయితే ఇప్పుడు నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి కాకుండానే.. కొత్తింట్లో కాపురం పెట్టబోతున్నారనే న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ప్రస్తుతం చెన్నై లోని ఓ కాస్ట్లీ అపార్ట్మెంట్ లో ఉంటున్న నయనతార ఇప్పుడు ఓ కాస్ట్లీ ఏరియా లోని కొత్తింటికి మకాం మార్చెయ్యబోతుంది అని అంటున్నారు.

అది కూడా జయలలిత, రజినీకాంత్, ధనుష్ లాంటి బడా సెలబ్రిటీస్ నివసించే పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని నయనతార కొనుగోలు చేసింది అని, నాలుగు బెడ్ రూమ్స్ ఉన్న ఈ ఇంటి కోసం నయనతార కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది అని, త్వరలోనే విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి నయనతార గృహప్రవేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఇల్లు మాత్రమే కాకుండా.. నయనతార అక్కడే పోయస్‌ గార్డెన్‌లో మరో ఇంటిని కూడా కొనుగోలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. మరి పెళ్లి కాకుండానే ఈ జంట కొత్తింటి గృహ ప్రవేశం చేసినా.. పెళ్లి తర్వాత ఈ ఇంట్లో కొత్త జంట కాపురం పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇక నయనతార తమిళంలోనే కాకుండా తెలుగులోను చిరంజీవి కి చెల్లెలిగా గాడ్ ఫాదర్ లో నటించబోతుంది. 

Nayanthara and Vignesh Shivan purchase luxury house in Poes garden:

Nayanthara Buys Swanky 4-BHK Apartment in Chennai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ