బాలకృష్ణ - బోయపాటి కాంబోలో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం అఖండ ప్రమోషన్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న టీం.. నేడు శనివారం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఈవెంట్ కి పుష్ప రాజ్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్. అలాగే ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మర్కెట్ ని షేక్ చెయ్యబోతున్న రాజమౌళి అతిధిగా హాజరయ్యారు. అదంతా ఓకె.. ఈవెంట్ కి బాలకృష్ణ అఖండలోని అఘోర గెటప్ అంటే.. నుదిటి మీద బొట్టు, పంచె కట్టు తో బాలయ్య హాజరై సర్ ప్రైజ్ చేసారు. అయితే బాలయ్య చేతికి రీసెంట్ గానే సర్జరీ జరగడంతో.. ఆయన చేతికి బెల్ట్ తో కనిపించారు.
ఈమధ్యన స్టయిలిష్ లుక్స్ తో ఫాన్స్ కి పిచ్చెక్కిస్తున్న బాలకృష్ణ.. తాజాగా అఖండ ఈవెంట్ లో స్పెషల్ గా స్టయిల్ గా కనిపించి ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. అయితే ఇక్కడ బాలయ్య ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి అంటే.. ఈ ఈవెంట్ కి బాలయ్య ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యామిలీ హాజరవడమే హాట్ టాపిక్ అయ్యింది. నిన్నగాక మొన్న నందమూరి ఫ్యామిలీ అంతా నారా భువనేశ్వరికి సపోర్ట్ గా మీడియా ముందుకు రావడం, తాజాగా అఖండ ఈవెంట్ లో నందమూరి ఫ్యామిలీ కనిపించడం చూస్తుంటే.. కాస్త సర్ ప్రైజింగ్ గానే ఉంది. ఇక ఈ రోజు ఈ ఈవెంట్ లో బాలయ్య ఏం మట్లాడబోతున్నారో అనే విషయంలో అందరూ తెగ క్యూరియాసిటీగా ఉండగా.. అసలు పెద్దగా మీడియా ముందుకు రాని నందమూరి ఫ్యామిలీ.. ఇలా ఈవెంట్ లో మెరవడం హాట్ టాపిక్ గా మారింది.