Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీట్

Mon 29th Nov 2021 07:26 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss nominations,bigg boss house,sunny vs siri,manas vs srirama chandra,kajal vs shanmukh  బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీట్
Nominations heat in Bigg Boss House బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి మూడు వారాల్లోనూ నామినేషన్స్ వేడి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా కేవలం మూడు వారాలే ఉన్న బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ మధ్యన ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది అనుకుంటే. నామినేషన్స్ రోజున ఆ బాండింగ్ అంతా గాల్లో కలిసిపోతుంది. ఇక ఈ రోజు సోమవారం బిగ్ బాస్ హౌస్ వేడెక్కే రోజు. నామినేషన్స్ డే.. హీట్ డే అంటుంటారు. అయితే ఈ రోజు నామినేషన్స్ లో షణ్ముఖ్, సన్నీ తప్ప మిగతా సిరి, మానస్, శ్రీరామ చంద్ర, కాజల్, ప్రియాంకలు ఉన్నట్లుగా లీకులు చెబుతున్నాయి. అయితే నామినేషన్స్ లో హౌస్ మేట్స్ మధ్యన మాత్రం అగ్గి రగిలింది.

అందులో ప్రియాంకకి తన ఫ్రెండ్స్ ని నామినేట్ చెయ్యడానికి రీజన్ లేదంటే.. కుదరదు లేకపోతె డైరెక్ట్ గా నామినేట్ అవుతావు అని బిగ్ బాస్ హెచ్చరించాడు. కాజల్ కి షణ్ముఖ్ మధ్యన వార్. సిరి - కాజల్ కి మధ్యన వార్. ఇక సన్నీ నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ గా ట్రీట్ అయిన వారిని నామినేట్ చెయ్యాలి అంటే నా ఫ్రెండ్స్ ని చెయ్యలేను అంటే.. ఫ్రెండ్ తప్పు చేసినా ఓకె నా అని అడిగింది సిరి. చిన్న చిన్న తప్పులైనా తప్పులని చెప్పే నువ్వు ఇలా అని షణ్ముఖ్ సన్నీని అనగానే.. నేను కాజల్ మీద అరిచాను అన్నాడు. తప్పుని తప్పు అని ఒప్పుకుంటున్నావా అని అడిగాడు షన్ను. ఇక సిరి కాజల్ ని, కాజల్ సిరిని నామినేట్ చెయ్యగా.. శ్రీరామ్ కి మానస్ కి మధ్యన నామినేషన్స్ విషయంలో గొడవ జరిగింది. మానస్.. శ్రీరామ్ ఫేస్ ఉన్న బాల్ ని తన్నాడని కష్టపడగా.. శ్రీరామ్ అక్కడ కూడా కామెడీ చేసాడు. 

Nominations heat in Bigg Boss House:

 Bigg Boss Telugu 5: Nominations heat 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ