బిగ్ బాస్ సీజన్ 5 మరో మూడు వారాల్లో ముగియబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఐదుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. గత రాత్రి అంటే సోమవారం రాత్రి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో కాజల్ - షణ్ముఖ్, సిరి - ప్రియాంక - సన్నీ ల మధ్యన గొడవ, సన్నీ - శ్రీరామ చంద్ర - మానస్ ల మధ్యన గొడవతో ముగిసింది. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలే అంటూ టాప్ 5 కి వెళ్లబోయే మొదటి కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ టాస్క్ పెట్టగా.. అందరూ పోటీ పడ్డారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టాప్ 5 అలాగే టాప్ 2 పై చర్చలు మొదలైపోయాయి. మొన్న ఆదివారం ఎపిసోడ్ లో షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ టాప్ 2 లో అంటే రన్నర్ గా ఉండబోతున్నాడంటూ హింట్స్ ఇచ్చేసింది. చేతి మీద రెండు వేళ్ళతో రాస్తూ.. రెండు వేళ్ళని చూపిస్తూ షణ్ముఖ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లుగా హింట్స్ ఇవ్వడం బుల్లితెర ప్రేక్షకులని దాటిపోలేదు.
ఇక BB హోటల్ టాస్క్ లో మాంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సన్నీ బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సన్నీ హౌస్ లో కాస్త అగ్రెస్సివ్ గా వెళ్లినప్పటికీ.. టాస్క్ ల పరంగాను, అన్ని విషయాల్లో హౌస్ మేట్స్ ని కలుపుకుపోయే సన్నీ విన్నర్ అవుతాడని అంటున్నారు. ఇక టాప్ 3 లో లో శ్రీరామ్ చంద్ర ఉంటాడని.. శ్రీరామ్ ఆటతీరు నచ్చినా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి శ్రీరామ్ కి టాప్ 3 స్థానం దక్కే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఈ రెండు వారాల్లో ప్రియాంక, కాజల్, సిరిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.