నాగార్జున - నాగ చైతన్య కలయికలో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ బంగార్రాజు అప్ డేట్స్ తో అక్కినేని అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. బంగార్రాజు మూవీ అలా మొదలయ్యిందో.. లేదో.. ఇలా అప్ డేట్స్ తో అక్కినేని ఫాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లుక్స్ తోనే బంగార్రాజు పై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి నాగ లక్ష్మి లుక్స్ అన్ని అదరగొట్టెయ్యడంతో.. బంగార్రాజు టీజర్ పై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుండి.. సినిమా షూటింగ్ ని కళ్యాణ్ కృష్ణ పరుగులు పెట్టిస్తున్నారు.
ఇదే స్పీడులో బంగార్రాజు మూవీ సంక్రాంతికి రిలీజ్ అనే ప్రచారం జరుగుతుంది. ఎన్ని సినిమాలున్నా నాగార్జున మాత్రం బంగార్రాజు ని సంక్రాంతికే ఫిక్స్ అన్నారని అన్నారు. కానీ ఈమధ్యన బంగార్రాజు సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.. పండగ వెళ్ళాక బంగార్రాజు రిలీజ్ డేట్ ఇవ్వొచ్చని ఊహాగానాలు మొదలైపోయాయి. అయితే నాగార్జున మాత్రం తన బంగార్రాజు పై నమ్మకంతో.. సంక్రాంతికి అంటే జనవరి 15 నే సినిమాని రిలీజ్ చెయ్యాలని పట్టుబడుతున్నారని, బంగార్రాజు టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ ని ఇచ్చేస్తారని అంటున్నారు. మరి ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఉన్నప్పటికీ నాగ్ మాత్రం అదే డేట్ కోసం పట్టుబడుతున్నారని వినికిడి. చూద్దాం నాగార్జున ఏం చేస్తారో అనేది.