నిన్న మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడుతూ హఠాన్మరణం చెందిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అంత్యక్రియలు ఈ రోజు మహాప్రస్థానంలో ఉదయం 10.30 గంటలకు జరగనున్నాయి. సిరివెన్నెల మృతి తో టాలీవుడ్ మూగబోయింది.. పలువురు ప్రముఖులు సిరివెన్నెల మరణ వార్త విని కిమ్స్ కి క్యూ కట్టారు. టాలీవుడ్ రాముఖులు, రాజకీయనాయకులు సిరివెన్నెల మృతికి తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భౌతిక కాయాన్ని ఇప్పుడే(ఉదయం 7 గంటలకి) సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుండి ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకువచ్చారు. అక్కడ అభిమానులు, సెలబ్రిటీస్ సందర్శనాంతరం చాంబర్ నుండి పదిగంటల ముప్పై నిమిషాలకు సీతారామ శాస్త్రి గారి భౌతిక కాయాన్ని మహాప్రస్థానం కి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆయనకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.