బాలకృష్ణ అఖండ రేపు థియేటర్స్ లోకి రావడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బాలయ్య అఖండ తో పెద్ద సినిమాతో బరిలోకి బాక్సాఫీసుని షేక్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసేసారు. మరోపక్క బుల్లితెర మీద ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో అంటూ అదరగొట్టేస్తున్నాడు బాలయ్య. మోహన్ బాబు, నాని లతో అన్ స్టాపబుల్ అంటూ ఇరగదీసిన బాలకృష్ణ రెండు వారాల గ్యాప్ తో మళ్ళీ వచ్చేస్తున్నారు. నేనేమి సీరియల్ ని కాదు వారం వారం రావడానికి అంటూ మళ్ళీ సందడి చేయడానికి రెడీ అయ్యారు. అది కూడా చేతికి ఆపరేషన్ జరిగి బెల్ట్ తోనూ ఆహా టాక్ షో కోసం బాలయ్య సాహసం చూస్తే ముచ్చటేస్తుంది.
ఇక బాలయ్య అప్ స్టాపబుల్ ఎపిసోడ్ 3 కి గెస్ట్ గా కమెడియన్ బ్రహ్మానందం అని, కాదు లైగర్ పాన్ ఇండియా హీరో విజయ్ దేవరకొండ హాజరవుతారని, తర్వాత ఆహా టాక్ షో కి ప్రభాస్, రానా లాంటి హీరోలు కూడా రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా బాలయ్య షో కి ఊహించని అతిథి రాబోతున్నాడని అంటున్నారు. అది దృశ్యం 2 తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి హాజరవుతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వెంకటేష్ - బాలయ్య లు సీనియర్ హీరోలు. మరి ఒకే ఏజ్ లో ఉన్న వీరిద్దరూ ఒకే స్టేజ్ పై ఎలాంటి అల్లరి చేస్తారో చూద్దాం