ఈ రెండు నెలలో విడుదల కాబోయే పెద్ద సినిమాల అప్ డేట్స్ తో టాలీవుడ్ లో ఓ జాతర మొదలైంది. సోషల్ మీడియాలో పెద్ద సినిమాల అప్ డేట్స్ తో ఫాన్స్ చేసే రచ్చ తో సోషల్ మీడియా, అటు సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. పాన్ ఇండియా మూవీస్ అప్ డేట్స్, భారీ బడ్జెట్ మూవీస్ అప్ డేట్స్ అంటూ మేకర్స్ హడావిడి చేస్తున్న టైం లో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అందరితో అంటే మెగాస్టార్ నుండి నిన్నమొన్నటి అక్కినేని అఖిల్ వరకు అందరితో ఎంతో అనుబంధం ఉన్న సిరివెన్నెలని కోల్పోవడం అందరికి షాకిచ్చింది. దానితో రెండు రోజుల్లో రావాల్సిన అన్ని పెద్ద సినిమాలు, చిన్న సినిమాల అప్ డేట్స్ పోస్ట్ పోన్ చేసారు.
పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ నుండి డిసెంబర్ 3 న అన్ని భాషల్లో ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు అది పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో దోస్తీ సాంగ్ సిరివెన్నెల రాసారు. ఇక త్రివిక్రం హాండ్స్ నుండి రాబోతున్న భీమ్లానాయక్ నుండి ఈ రోజు ఉదయం అడవి తల్లి సాంగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది.. అది కూడా వాయిదా పడింది. అందులోనూ త్రివిక్రమ్ కి సిరివెన్నెల బంధువు కూడా అవడంతో.. మేకర్స్ భీమ్లా నాయక్ అప్ డేట్ వాయిదా వేశారు. మరోపక్క బంగార్రాజు నుండి రావాల్సిన టీజర్ ని వాయిదా వేశారు మేకర్స్.
ఇక టాలీవుడ్ సెలెబ్రిటీస్ అంతా సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళు అర్పించారు. మెగాస్టార్, బాలయ్య, నాగార్జున, వెంకీ, పవన్, తారక్, అల్లు అర్జున్ ఇలా అందరూ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళు అర్పించారు.