పుష్ప సినిమా స్పెషల్ సాంగ్ షూట్ లో అల్లు అర్జున్ సమంత తో బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఈ నెల 17 న ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. రేపు ఆరో తారీఖున పుష్ప మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.. ఈలోపు అల్లు అర్జున్ బాలయ్య నటించిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లడం, అక్కడ నందమూరి అభిమానుల అభిమానం గెలుచుకోవడం.. అలాగే ఈటీవీలో గత కొన్నేళ్లుగా ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్న ఢీ డాన్స్ షో కింగ్స్ vs క్వీన్స్ గ్రాండ్ ఫినాలేకి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. అక్కడ గ్రాండ్ ఫినాలేలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సాంగ్స్ తో కంటెస్టెంట్స్ ఢీ స్టేజ్ ని ఊపేసారు. అదంతా ఓ ఎత్తైతే అల్లు అర్జున్ చేసిన కామెడీ మరో ఎత్తు..
యాంకర్ ప్రదీప్ ప్రియమణి గారు డాన్స్ బాగా చేసిన వాళ్ళకి హగ్ ఇస్తారు.. అదే పూర్ణ గారైతే డాన్స్ బాగా చేస్తే బుగ్గ కోరుకుతారనగానే అల్లు అర్జున్.. ఇంకా బాగా చేస్తే ఇంకేం చేస్తారో అని పూర్ణని అనగానే అందరూ నవ్వేశారు. ఇక ఢీ స్టేజ్ పై గ్రాండ్ ఫినాలే పెరఫార్మెన్స్ కి బన్నీ చాలా ఫిదా అయ్యాడు. అలాగే ఆది - సుధీర్ చేసిన కామెడీని ఎంజాయ్ చేసిన.. అల్లు అర్జున్ కూడా అవసరమైన చోట అదిరిపోయే డైలాగ్స్ తో అదరగొట్టేసాడు.. అల్లు అర్జున్ ని హగ్ అడిగిన ప్రియమణికి షాకిస్తూ.. ఈ మధ్యన సన్నబడి హాట్ గా తయారయ్యావ్ అంటూ షాకింగ్ గా మాట్లాడాడు.. అంతేకాదు.. గణేష్ మాస్టర్ అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి హగ్ ఇవ్వగానే.. అమితాబ్ గారిని చూసినప్పుడు నా హైట్ నాకు గుర్తుకు వస్తుంది.. నీ పక్కన, రష్మిక అంటే పుష్ప హీరోయిన్ పక్కన చూసుకుంటే తాను చాలా హైట్ గా ఫీలవుతాను అంటూ సరదాగా నవ్వించేసాడు. ఇక లాస్ట్ లో ఢీ విన్నర్ ని వచ్చే ఎపిసోడ్ లో అల్లు అర్జున్ రివీల్ చేసాడు.