బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్న బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టాప్ 5 కి వెళ్లబోయే ఫస్ట్ కంటెస్టెంట్ కోసం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో కాజల్, సిరి, మానస్, శ్రీరామ చంద్ర, ప్రియాంకలు ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్ లు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని కన్నా.. ఎవరి ఫస్ట్ టాప్ 5 లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో అనే దాని మీద అందరికి ఆసక్తి పెరిగిపోయింది. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఎవరు విజేతలవుతారో మరి చూసేద్దాం.
ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ విషయంలో సిరికి సన్నీకి మధ్యన వార్ జరిగింది.. దానిపై పెద్ద డిస్కర్షన్ జరిగింది కూడా. మధ్యలో సిరి, శ్రీరామ చంద్ర ఐస్ ట్యూబ్స్ లో కాళ్ళు పెట్టడం వలన కాస్త అస్వస్థతకు గురవ్వగా డాక్టర్స్ వారికీ ట్రీట్మెంట్ చెయ్యడంతో వారు సేఫ్ అయ్యారు. ఇక ఈ టాస్క్ తర్వాత ఫోకస్ టాస్క్ లో ఎక్కువ పాయింట్స్ తో మానస్ నిలిచినట్లుగా తెలుస్తుంది. తర్వాత స్థానాల్లో సిరి, శ్రీరామ్ లు ఉన్నారని.. ఫస్ట్ టాప్ 5ని మానస్ సొంతం చేసుకునేలా కనిపిస్తుంది అంటున్నారు.. మరి టికెట్ టు ఫినాలే టాస్క్ లో మానస్ గెలిచాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. చూద్దాం ఎవరు ఫస్ట్ టాప్ 5 కి వెళతారో అనేది.