ప్రభాస్ అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని రాధేశ్యాం తో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ హిందీ సాంగ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా తెలుగు సాంగ్ విడుదలయింది. నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.