గత రాత్రి ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే రేస్ లో.. ఐస్ ట్యూబ్స్ టాస్క్ లో సిరి, శ్రీరామ్ చంద్రలు గాయాపడి.. ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే సన్నీ కేవలం సిరి, శ్రీరామ్ లనే టార్గెట్ చేసాడని షణ్ముఖ్ అనగా.. కాజల్ దానికి ఒప్పుకోలేదు సన్నీ నన్ను కూడా టార్గెట్ చేసాడు అంది. .. ఆ విషయంలో షణ్ముఖ్ - కాజల్ మధ్యన గొడవ జరిగింది.. ఆ విషయంలో కాజల్ మానస్ - సన్నీ లతో మీటింగ్ పెట్టగా. సిరి - షణ్ముఖ్ లు ఆ విషయంలో తెగ చర్చించేసారు. ఇక తర్వాత టికెట్ టు ఫినాలే టాస్క్ లో పాయింట్స్ పరంగా మానస్ ఫస్ట్ లో ఉండగా.. శ్రీరామ చంద్ర 2rd సిరి 3rd ప్లేస్ లో ఉన్నారు. సన్నీ 4th ప్లేస్ లో ఉన్నాడు. షణ్ముఖ్, కాజల్, ప్రియాంక టికెట్ టు ఫినాలే టాస్క్ లో అర్హత కోల్పోయారు.
అయితే శ్రీరామ చంద్ర ప్రియాంక తో మట్లాడుతూ.. ప్రియాంక నువ్ హౌస్ లో 19 మంది సభ్యులతో ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అయ్యావ్ అనగానే.. ఫస్ట్ మానస్, సెకండ్ సిరి తో బాగా కనెక్ట్ అయ్యాను అనింది. మానస్ కి నాకు మధ్యలో ఏముందో తెలుసు. ఒకసారి ప్రేమ విషయంలో పెయిన్ తీసుకున్నాను.. మళ్ళీ అలా జరగాలనుకోవడం లేదు.. కానీ మానస్ నా నుండి ఏం ఆశిస్తున్నావ్ అని పదే పదే అనడం నచ్చలేదు.. అలాగే కొన్ని రోజులుగా అవాయిడ్ చేస్తున్నాడు అంది.. శ్రీరామ్ దానికి నువ్ మానస్ కూర్చుని మట్లాడుకోండి అన్నాడు.. ప్రియాంక అనడం కాదు కానీ.. సేవలు చేయించుకున్నన్ని రోజులూ సేవలు చేయించుకుని.. మానస్ ప్రియాంక ని ఇలా చెయ్యడం నచ్చలేదని నెటిజెన్స్ కూడా అభిప్రాయం పడుతున్నారు.