బోయపాటి - బాలకృష్ణ కాంబో అంటేనే బాక్సాఫీసు ఊచకోత అనే విషయం.. సింహ, లెజెండ్ మూవీస్ తో అది స్పష్టంగా అర్ధమైంది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా వచ్చిన అఖండ మూవీ కూడా బాక్సాఫీసుని ఊచకోత కొయ్యడం మొదలు పెట్టేసింది. బాలకృష్ణ అఘోర గెటప్, థమన్ మ్యూజిక్, బోయపాటి మేకింగ్, బాలయ్య డైలాగ్స్ అన్ని అఖండ కి హైలెట్స్ అవడంతో.. సినిమాకి ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ పడిపోయింది. మాస్ ప్రేక్షకులని ఉర్రుతలూగించే హీరో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో.. అఖండ మస్ హిట్ గా నిలిచింది. ఇక పాజిటివ్ టాక్, క్రేజీ అంచనాలతో అఖండ మూవీ మొదటి రోజు బాక్సాఫీసుని చీల్చి చెండాడింది.. అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్ మీకోసం..
ఏరియా 1st డే కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 4.39
సీడెడ్ - 4.02
ఉత్తరాంధ్ర - 1.36
ఈస్ట్ గోదావరి - 1.05
వెస్ట్ గోదావరి - 0.96
గుంటూరు - 1.87
కృష్ణా - 0.81
నెల్లూరు - 0.93
ఏపీ-తెలంగాణ టోటల్ - 15.39 (23 కోట్లు గ్రాస్)
ఇతర ప్రాంతాలు - 1.00
ఓవర్సీస్ - 2.35
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 18.74 కోట్లు (29.5 కోట్లు గ్రాస్)