Advertisementt

శిల్పా చౌదరి మాయలో టాలీవుడ్ హీరో

Fri 03rd Dec 2021 07:38 PM
sehari movie,hero harsh kanumilli,shilpa chaudhary,cheating case,sehari movie hero harsh kanumilli  శిల్పా చౌదరి మాయలో టాలీవుడ్ హీరో
Young Hero Among Con-woman Shilpa Victims List శిల్పా చౌదరి మాయలో టాలీవుడ్ హీరో
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మాయలేడి శిల్పా చౌదరి మోసాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం కలకలం సృష్టిస్తుంది. బిగ్ ఫ్యామిలీ లేడీస్ తో కిట్టి పార్టీల పేరుతొ అధిక వడ్డీలకి కోట్లలో అప్పులు తీసుకున్న మాయ లేడీ శిల్పా చౌదరిని పోలీస్ లు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ధనవంతుల దగ్గర తీసుకున్న కోట్లాదిరూపాయలని శిల్పా చౌదరి ఎక్కడికి తరలించింది అనే కోణంలో పోలీస్ దర్యాప్తు చేపట్టారు. ఇక శిల్పా చౌదరికి అప్పు ఇచ్చి మోసపోయిన వారిలో ప్రముఖ నటుడు సూపర్ స్టార్ చెల్లి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కూడా ఉంది. ఆమె శిల్పా చౌదరికి 2.90 కోట్లు ఇచ్చి మోసపోయినట్లుగా పోలీస్ లకి ఫిర్యాదు చేసింది.

తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో శిల్పా చౌదరికి కోట్లలో అప్పు ఇచ్చి నష్టపోయినట్లుగా తెలుస్తుంది. సెహరి సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న హర్ష్ కనుమిల్లి శిల్పా చౌదరి ఇచ్చిన పార్టీల మాయలో పడి నట్టేట మునిగినట్టు చెబుతున్నారు. హర్ష కనుమూరి.. తాను శిల్పా చౌదరికి 3 కోట్లు ఇచ్చి నష్టపోయానని ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. హర్ష కనుమిల్లి సెహరి సినిమాకి శిల్పా చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తోంది అని, హర్ష ని హీరోగా చెయ్యడానికి అతని దగ్గరే అప్పు తీసుకుని మూడు చెల్లని చెక్కులు, నకిలీ బంగారాన్ని హర్ష దగ్గర తాకట్టు పెట్టినట్లుగా చెబుతున్నారు.

మరోపక్క సినిమా ఇండస్ట్రీలో చాలామంది శిల్పా చౌదరి మాయలో పడి కోట్లకి కోట్లు అప్పులిచ్చి.. ఇప్పడు ఆమె అరెస్ట్ అవడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆమెపై కంప్లైంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారనే టాక్ మొదలైంది. మరోపక్క సెలబ్రిటీస్, బడా బాబుల నుండి దోచిన కోట్లని శిల్పా చౌదరి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌ చేసిందన్న వివరాలపై కూడా పోలీస్ లు ఆరాతియ్యబోతున్నారని, ఈకేసులో శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్ దొరికిన.. శిల్పా చౌదరికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఆమెను రెండు రోజులు పోలీస్ కష్టడికి అనుమతించింది కోర్టు. 

Young Hero Among Con-woman Shilpa Victims List :

Sehari Movie Hero Harsh Kanumilli Cheated by Shilpa Chaudhary  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ