Advertisementt

బిగ్ బాస్ 5: వారు సేఫ్.. వీరు డేంజర్

Fri 03rd Dec 2021 07:55 PM
bigg boss telugu 5,bi gg boss telugu,priyanka,kajal,danger zone  బిగ్ బాస్ 5: వారు సేఫ్.. వీరు డేంజర్
Bigg Boss 5: 2 Contestants in Danger Zone బిగ్ బాస్ 5: వారు సేఫ్.. వీరు డేంజర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా 13 వారాలు పూర్తి చేసుకుని 14 వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియబోతుంది. ఈ వారంలో బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఉన్న ఏడుగురి కంటెస్టెంట్స్ లో ఐదుగు నామినేషన్స్ లో ఉన్నారు. షణ్ముఖ్, సన్నీ తప్ప మిగతా కాజల్, మానస్, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంకలు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ లో సిరి, మానస్ లు ఫైనల్ గా పోటీ పడుతుండగా.. ఫస్ట్ టాప్ 5 లో మానస్ ఈ టాస్క్ లో గెలిచి చోటు సంపాదించాడని అంటున్నారు. అదలా ఉంటే.. ఈ వారం హౌస్ నుండి వెళ్లబోయే కంటెస్టెంట్ పై అందరిలో ఆసక్తి మొదలైంది.

ఇక నామినేషన్స్ లో ఉన్న శ్రీరామ చంద్ర ఓటింగ్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. తర్వాత ప్లేస్ లో మానస్ అండ్ సిరిలు ఉన్నారని.. మానస్ - సిరి లలో రోజు రోజుకి చెరొకరు ఓటింగ్ లో టాప్ లోకి వెళుతున్నారని, ఈ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉండగా.. ఈ వారం కాజల్ అండ్ ప్రియాంక లు డేంజర్ జోన్ లో ఉన్నారని.. కాజల్‌కు కూడా మంచిగానే ఓట్లు వస్తున్నా.. కాజల్ నాలుగో స్థానానికే పరిమితం అయిందని, ఫైనల్ గా ఈ వారం ప్రియాంక నే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో కంటెస్టెంట్స్ లోనూ అయోమయం నెలకొంది. ఎందుకంటే స్ట్రాంగ్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడం అందరిని షాక్ కి గురి చేసింది.. సో అటు బుల్లితెర ప్రేక్షకులు, ఇటు హౌస్ మేట్స్ కూడా గందరగోళంలో ఉన్నారని అంటున్నారు.

Bigg Boss 5: 2 Contestants in Danger Zone:

Bigg Boss Telugu 5: Priyanka and Kajal in Danger Zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ