Advertisementt

బిగ్ బాస్ 5: శ్రీరామ్ కి ట్విస్ట్ ఇచ్చిన నాగ్

Sat 04th Dec 2021 07:11 PM
bigg boss 5,bigg boss telugu,nagarjuna,shriram chandra,ticket to finale race,top 5  బిగ్ బాస్ 5: శ్రీరామ్ కి ట్విస్ట్ ఇచ్చిన నాగ్
Bigg Boss 5: Nagarjuna twist to Shriram బిగ్ బాస్ 5: శ్రీరామ్ కి ట్విస్ట్ ఇచ్చిన నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 13 వారాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని.. 14వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు 12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లగా.. ఈ వారం ఏ కంటెస్టెంట్ బయటికి వెళతారో అనే ఆసక్తి బుల్లితెర ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఈ వారం కాజల్ - ప్రియాంకలు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నాగార్జున శనివారం ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేసింది స్టార్ మా.. అందులో బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ ని నాగార్జున ఆటపట్టిస్తూనే కామెడీ చేయించాడు. ఇక నాగ్ స్టేజ్ పై ఉండి సిరి నీ కంప్లైంట్ ఎవరి మీద అనగానే షణ్ముఖ్ మీద అంది.. ఎందుకు నిన్ను నా ఫ్రెండ్ కాదు అన్నందుకా.. లేదంటే నిన్ను గెలిపించకుండా, శ్రీరామ్ ని గెలిపించినందుకా.... అయినా హగ్ ఇచ్చావుగా అన్నాడు నాగ్.

ఇక కాజల్ నీ కంప్లైంట్ ఎవరి మీద అనగానే.. సన్నీ సర్.. సన్నీ ఆలోచించకుండా అరుస్తాడు అంది. సారి సర్.. అని సన్నీ అనగా.. సర్ కి ఎందుకు అంది.. సారి కాజల్ అన్నాడు. ఇక కాజల్ నువ్ టిష్యు పేపర్ ని శుభ్రంగా తుడిచి సన్నీ మీద విసిరినందుకా అంటూ నాగ్ కాజల్ కి ఝలక్ ఇచ్చాడు. ఇక ఈ సీజన్ 5 లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎంపికైన శ్రీరామ్ కి నాగార్జున బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేమిటంటే.. నువ్ ఈ వారం సేఫ్ అయ్యి హౌస్ లో ఉంటేనే.. నువ్వు ఈ టికెట్ టు ఫినాలే ట్రోఫీ గెల్చుకుని.. టాప్ 5 లో మొదటి కంటెస్టెంట్ వి అవుతావు అంటూ శ్రీరామ్ చంద్రకి షాక్ ఇచ్చాడు నాగ్. మరి శ్రీరామ్ ఎలాగూ సేఫ్ అవుతాడు.. అందులో ఎలాంటి సందేహము లేదు.. కానీ ప్రేక్షకుల్లో మాత్రం ఏదో ఆత్రుత అంతే..

Bigg Boss 5: Nagarjuna twist to Shriram:

Bigg Boss Telugu 5: Today Promo Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ