బిగ్ బాస్ హౌస్ లోకి క్రేజీ గా, టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన షార్ట్ ఫిలిం షణ్ముఖ్ జాస్వంత్.. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల కన్నా ఎక్కువగా సిరి తో హగ్స్, కిస్ లతో బాగా హైలెట్ అయ్యాడు. మొదటి వారం నుండి కేవలం సిరి, జెస్సి లతో మోజో రూమ్ లో కూర్చుని ముచ్చట్లు పెట్టిన షణ్ముఖ్.. ఈమధ్యన కాస్త పెరఫార్మెన్స్ చూపిస్తున్నాడు. బిగ్ బాస్ చివరి దశకి చేరుకున్నాక టాస్క్ ల్లో పెరఫార్మెన్స్ చూపిస్తున్న షణ్ముఖ్ బయట భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. మరోపక్క షణ్ముఖ్ - సిరి ల హగ్స్ విషయంలో సిరి తల్లి చేత తిట్లు తిన్నాడు.
ఇక టైటిల్ ఫెవరెట్ నుండి ఇప్పుడు సెకండ్ ప్లేస్ లోకి పడిపోయిన షణ్ముఖ్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అది కూడా నేషనల్ వైడ్ గా ట్విట్టర్ లో మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవడం షాకింగ్ అనిపిస్తుంది. ఆరు గంటల్లోనే 1.10 మిలియన్ ట్వీట్లు చేసి నేషనల్ రికార్డును క్రియేట్ చేశారు. UnstoppableShannu అనే ట్యాగ్‌తో షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తూ ఆయన ఫాన్స్ ట్విట్టర్ లో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 మరో రెండు వారాల్లో ముగియబోతుంది. దానితో షణ్ముఖ్ ఫాన్స్ ఇలా అలెర్ట్ అయ్యి.. UnstoppableShannu అనే ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ తమ సపోర్ట్ షణ్ముఖ్ కే అని, అతనే టైటిల్ విన్నర్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.