అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ డిసెంబర్ 17 న విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాలున్న పాన్ ఇండియా మూవీ పుష్ప ఐదు భాషల్లో రిలీజ్ కి సిద్దమైంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్ తో సినిమాపై అంచనాలు రేపిన సుకుమార్ అండ్ టీం.. రేపు విడుదల చెయ్యబోయే ట్రైలర్ పై అందరిలో ఆసక్తి కలిగేలా పోస్టర్స్ వదులుతుంది. మధ్యలో పుష్ప ట్రైలర్, ట్రీజర్ అలాగే పుష్ప మేకింగ్ వీడియో అంటూ అంచనాలు అంతకంతకు పెంచేస్తుంది. అల్లు అర్జున్ - రశ్మికల కలయికలో వచ్చిన సాంగ్స్ మర్కెట్ ని ఊపేస్తున్నాయి.
ఇక తాజాగా పుష్ప నుండి ఓ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసింది టీం. ఆ మేకింగ్ వీడియో అంతా ఫారెస్ట్ లో తీసింది.. ఆ వీడియో మేకింగ్ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గెటప్ లో మైక్ తీసుకుని.. పుష్ప టీం కి కొన్ని సూచనలు చేసాడు. మనం ఎలా అయితే వచ్చామో అలానే ఎక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి.. ఎవరు పేపర్ కప్ వాడినా, పేపర్ ప్లేట్ వాడినా.. ఎవరు వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పుల్ని వారే దయచేసి డస్ట్‌బిన్‌లో వేయండి. షూటింగ్ కి మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం.. అని చెప్పడం, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప యాక్షన్ సీన్స్ అన్ని ఈ పుష్ప మేకింగ్ వీడియో కి హైలైట్స్ గా ఉన్నాయి.