Advertisementt

మానస్ గురించి తెలుసుకుని షాకయిన పింకీ

Mon 06th Dec 2021 03:38 PM
bigg boss telugu,bigg boss 5,priyanka singh,manas,bigg boss buzz,priyanka interview  మానస్ గురించి తెలుసుకుని షాకయిన పింకీ
Priyanka Singh On Manas In Bigg Boss Buzz మానస్ గురించి తెలుసుకుని షాకయిన పింకీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5 చివరి రెండు వారాలకు గాను.. షణ్ముఖ్, సన్నీ, సిరి, శ్రీరామ చంద్ర, మానస్ , కాజల్ లు మిగిలారు.. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే.. మిగతా ఐదుగురు టాప్ 5 లోకి అడుగుపెడతారు. ఇక నిన్న ఆదివారం హౌస్ నుండి 13 వ కంటెస్టెంట్ గా బయటికి వచ్చిన ప్రియాంక.. బిగ్ బాస్ హౌస్ లో మానస్ తో ఫ్రెండ్ షిప్ చెయ్యడమే కాదు, మానస్ కి ఫ్రెండ్ గా సేవలు చేసింది, అలాగే ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ఇష్టపడింది. మానస్ కూడా సేవలు చేయించుకున్నాడు. కానీ ప్రియాంక తనని ఫ్రెండ్ గా కాకుండా ఇంకేదో ఎక్సపెక్ట్ చేస్తుంది అని.. తన పాత బాయ్ ఫ్రెండ్ కి తనని రీప్లేస్ చెయ్యాలని చూస్తుంది అంటూ ఆమెని చివరి వారంలో దూరం పెట్టాడు.. అయినా ప్రియాంక లైట్ తీసుకుంది. ఇక ప్రియాంక హౌస్ నుండిఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ బజ్ లో అరియనా తో ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూలో మానస్ నిజ స్వరూపాన్ని అరియనా వీడియోస్ వేసి మరీ ప్రియాంక కి చూపించింది. అందులో నాగార్జున మానస్ తో మట్లాడుతూ ప్రియాంక నిన్ను ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ఊహించుకుంటుంది అనగానే.. మానస్ నేను కూడా అదే అనుకుంటున్నాను సర్.. చెప్పినా అర్ధం కావడం లేదు.. మొహం మీద చెబితే ఎలా రియాక్ట్ అవ్వుద్దో అనే భయంతో ఉన్నాను అన్న వీడియో తో పాటుగా.. మనస్- కాజల్ కలిసి సన్నీ దగ్గర ప్రియాంక క్లోజ్ గా మూవ్ అవడానికి కారణం సన్నీ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది.. దానిని తనకి వాడేలా సన్నీ తో మూవ్ అవుతుంది అని మానస్ కాజల్ తో అన్నాడు.. నీ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంటే నీతోనూ అలానే ఉండేది అని అన్నాడు. ఇక ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది అని మానస్ పదే పదే అన్న వీడియో చూసి ప్రియాంక బాగా ఫీల్ అయ్యింది. నేను ఫ్రెండ్ లానే ఉన్నాను, ఉంటాను.. కానీ మానస్ అలా అనుకోలేదు అంటూ ఫీలైంది. నేను నా మాజీ బాయ్ ఫ్రెండ్ స్థానంలోకి మానస్ ని తేవాలనుకోలేదు అంటూ చాలా హార్ట్ అయ్యింది.

Priyanka Singh On Manas In Bigg Boss Buzz:

Bigg Boss Telugu: Priyanka Singh On Manas In Bigg Boss Buzz Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ