Advertisementt

బిగ్ బాస్ 5: ఎవరు నెంబర్ వన్

Mon 06th Dec 2021 09:22 PM
bigg boss telugu 5,bigg boss telugu,bigg boss,shanmukh,srirama chandra,siri,kajal,manas,sunny  బిగ్ బాస్ 5: ఎవరు నెంబర్ వన్
Bigg Boss 5: Who's Number One బిగ్ బాస్ 5: ఎవరు నెంబర్ వన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియబోతుంది. ప్రస్తుతం హౌస్ లో అరుగు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శ్రీరామ్ చంద్ర టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా టాప్ 5 కి వెళ్ళిపోయాడు. కాజల్, సిరి, షణ్ముఖ్, మానస్, సన్నీ ఇప్పుడు టాప్ 5 కి పోటీ పడుతున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏ స్థానానికి సరిపోతారో అంటూ ఆరు నెంబర్లు ఉన్న ప్లేట్స్ ని కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్.. ఎవరు నెంబర్ వన్, ఎవరు ౨, ఎవరు సిక్స్ ప్లేస్ లో ఉంటారు అనేది టాస్క్.. ఇంటి సభ్యులు తేల్చుకుని ఏ పొజిషన్ కి ఎవరు అర్హులో వారే ఉండాల్సి ఉంటుంది.

అయితే శ్రీరామ్ కి నేను 4th ర్యాంక్ ఇస్తా అన్నాడు మానస్.. అలాగే సన్నీ, షణ్ముఖ్ లు నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. సిరి నేను షణ్ముఖ్ ని నెంబర్ వన్ లో చూడాలి అనుకుంటున్నాను అనగా... దానికి శ్రీరామ చంద్ర అదేమిటి నిన్ను నువ్వు నెంబర్ వన్ లో చూసుకోవా అని అనగా.. దానికి సిరి లేదు అంది.. ఇక సన్నీ ఇక్కడ ఫ్రెండ్స్ సపోర్ట్ వద్దు.. నేను నా దోస్త్ లు అంటాను, షణ్ముఖ్ సిరి పేరు చెబుతాడు, సిరి షణ్ముఖ్ పేరు చెబుతుంది, కాజల్ నా పేరు, మానస్ పేరు చెబుతుంది.. ఆఖరికి శ్రీరామ్ చంద్ర నే ఒంటరి వాడవుతాడు.. అతన్ని ఎవరూ సపోర్ట్ చెయ్యరు అన్నాడు. ఇక కాజల్ కి షణ్ముఖ్ కి మధ్యన గొడవ జరిగింది. దానితో షణ్ముఖ్ వెళ్లి ఆరో నంబర్ ర్యాంక్ వద్ద నిలుచున్నాడు. దాంతో ఓవర్ యాక్షన్ చేయకు.. నీ ర్యాంక్ సిక్స్ అనుకొంటున్నావా.. నన్ను బ్లేమ్ చెయ్యడానికే షణ్ముఖ్ అలా చేసాడని సన్నీకి చెప్పుకుంది కాజల్. మరి బిగ్ బాస్ లో ఈ నెంబర్ వన్ ప్లేస్ రచ్చ మాములుగా లేదుగా..

Bigg Boss 5: Who's Number One:

Bigg Boss Telugu 5: Who is number one position

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ