Advertisementt

రీ షూట్ మోడ్ లో ప్రభాస్ సలార్

Mon 06th Dec 2021 10:53 PM
prabhas,salaar movie,prashanth neel,salaar movie shoot,sruthi haasan,jagapathi babu,prabhas radhe shyam,prabhas adipurush,spirit,project k  రీ షూట్ మోడ్ లో ప్రభాస్ సలార్
Reshoots underway in Salaar రీ షూట్ మోడ్ లో ప్రభాస్ సలార్
Advertisement
Ads by CJ

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడమే.. ముంబై వెళ్లి ఓం రౌత్ దర్శకత్వంలో 3D ఫిలిం ఆదిపురుష్ షూటింగ్ చుట్టేసి వచ్చాడు.. ఇక ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న సలార్ మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అదేమిటంటే.. సలార్ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ గుజరాత్ లో ప్లాన్ చేసిన కరోనా కారణంగా దానిని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ కి షిఫ్ట్ చేసి అక్కడ వేసిన సెట్ లో కొన్ని రోజుల ఆపాటు చిత్రించారు. 

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ సెకండ్ షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరించారు. అయితే  హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సలార్ ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్‌ రష్‌ను చూసిన ప్రశాంత్ నీల్ ఆ ఎపిసోడ్ పై అసంతృప్తిగా ఉన్నాడని, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ ని మళ్ళీ రీ షూట్ చెయ్యాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యాడని, మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సలార్ సెట్ లోనే రీ షూట్ కూడా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ రీ షూట్ వలన మేకర్స్ కి అదనంగా ఓ కోటి ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటున్నారు. ఎంత ఖర్చయినా కాంప్రమైజ్ కావొద్దని ప్రశాంత్ నీల్ కి సలార్ మేకర్స్ భరోసా ఇవ్వడంతోనే ఆయన ఈ రీ షూట్ పెట్టారని సమాచారం. 

Reshoots underway in Salaar:

Salaar in reshoot mode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ