Advertisementt

విడాకుల తర్వాత చచ్చిపోతానేమో అనుకున్నా

Tue 07th Dec 2021 03:47 PM
samantha,naga chaitanya,samantha divorce,samantha trolls,fans trolls  విడాకుల తర్వాత చచ్చిపోతానేమో అనుకున్నా
Thought I would crumble and die after separation: Samantha విడాకుల తర్వాత చచ్చిపోతానేమో అనుకున్నా
Advertisement
Ads by CJ

సమంత నాగ చైతన్యకి కి విడాకులిచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా మారింది.. ఊహకందని పోస్ట్ లతో సమంత విడాకుల మేటర్ ని, ఆ బాధని దిగమింగడానికి చాలా ట్రై చేసింది. అంతలోపు నాగ చైతన్య కి విడాకులివ్వడం ఇష్టం లేని ఫాన్స్ సమంతని విపరీతంగా ట్రోల్ చేసి ఏడిపించారు.. ఆఖరికి ఈ విషయంలో సమంత కోర్టుకి కూడా వెళ్ళింది. అయితే ఇప్పటివరకుకు సోషల్ మీడియాలోనే తన బాధని, తన డివోర్స్ మేటర్ ని ఇండైరెక్ట్ గా స్పందించిన సమంత.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడింది. నాగ చైతన్య కి విడాకులిచ్చాక తాను చనిపోతానేమో అనుకున్నాను అని, తాను మెంటల్లీ చాలా వీక్ అని, కానీ నేను ఇప్పటివకు స్ట్రాంగ్ గానే నిలబడ్డాను అని చెప్పింది.

అలాగే తనపై దారుణమైన ట్రోల్స్ చేసిన అభిమానులకి సమంత సున్నితంగానే మందలించింది. అంటే తనని ట్రోల్ చెయ్యకుండా మరోలా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పినట్లయితే బావుండేది అని, తన లైఫ్ లో ప్రతి మేటర్ ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడతాను అని, కానీ ఫాన్స్ అనుకున్నట్టుగా, వారు ఆశించినట్లుగా తాను, తన అభిప్రాయాలూ ఉండకపోవచ్చని, అంతెందుకు ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన, ఫ్రెండ్స్ మధ్యనే ఏకాభిప్రాయం ఉండదు అలాంటిది అభిమానుల విషయము అంతే.. కానీ నా నిర్ణయాలు ఫాన్స్ ఒప్పుకోవాలని నేను అనుకోను. కాకపోతే వారలా నన్ను దారుణంగా ట్రోల్ చెయ్యకుండా వారి అభిప్రాయాన్ని వేరేలా తెలియజేసి ఉంటే బావుండేది అంటుంది. 

నేను విడాకులు తీసుకున్న బాధలో ఉండగా.. నేను పిల్లలు వద్దనుకున్నాను అని, ఏవో ఎఫ్ఫైర్స్ ఉండడం వలనే నేను చైతూకి విడాకులిచ్చాను అని, అవకాశవాదిని అంటూ చాలా బాధపెట్టారు. ఇక ఈ ఏడాది తనకి మరిచిపోలేని చేదు జ్ఞాపకాలను పంచింది అంటూ చెప్పుకొచ్చింది సమంత.

Thought I would crumble and die after separation: Samantha:

Samantha thought she would die after divorce

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ