గత మూడు రోజులుగా హైదరాబాద్ లో డ్రంక్ డ్రైవ్ చేస్తూ పలువురు యాక్సిడెంట్స్ చెయ్యడం నగరంలో కలకలం రేగింది. డాక్టర్స్ అయ్యుండి, మంచి జాబ్స్ లో ఉన్నవారు. ప్రముఖుల పిల్లలు ఇలా మద్యం సేవించి యాక్సిడెంట్స్ చేసి.. కొంతమంది ప్రాణాలను బలి తీసుకున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ మూడు రోజుల్లోనే మద్యం సేవించి యాక్సిడెంట్ చేసిన కేసులు చాలానే బుక్ చేసారు పోలీస్ లు. అయితే తాజాగా సీరియల్ నటి లహరి కూడా హైదరాబాదు శివారు శంషాబాద్ ప్రాంతంలో యాక్సిడెంట్ చెయ్యడం కలకలం సృష్టించింది. స్వయంగా కారు నడుపుతున్న లహరి.. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. లహరి చేసిన ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడ కారు యాక్సిడెంట్ అవ్వగానే.. కొంతంది స్థానికులు గుమ్మిగూడి.. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే కారు చుట్టూ ఎక్కువమంది గుమ్మిగూడటంతో.. లహరి కి భయమేసి.. ఆమె కారు కూడా దిగలేదు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని కారులోనే ఉండిపోయిన లహరిని పోలీసులు కారుతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే లహరి మద్యం సేవించిందేమో అనే అనుమానాలతో ఆమెకి పోలీస్ లు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహించారని, ఇంకా లహరి యాక్సిడెంట్ వివరాలు తెలియరావాల్సి ఉంది అంటున్నారు. సీరియల్స్ లో చాలా ఒబ్బిడిగా, ట్రెడిషనల్ గా కనబడే లహరి.. ప్రస్తుతం స్టార్ మా లో గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తుంది.