రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7 న అంటే ఇంకా కరెక్ట్ గా ఓ నెల రోజుల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 9న ఆర్.ఆర్.ఆర్ నుండి పాన్ ఇండియా లెవల్లో పలు భాషల్లో ట్రైలర్ ని వదలబోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పై అంతకంతకు ఆసక్తిని రేకెత్తించేలా జక్కన్న వదిలే పోస్టర్స్, వీడియోస్ చూస్తే.. ట్రైలర్ లో ఎలాంటి కంటెంట్ ఉంటుందో అనే ఆసక్తి, ఆత్రుత పెరిగిపోతుంది. వదిలే పోస్టర్, వీడియోస్ లో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ ఆ ఆసక్తిని, ఆత్రుతని మరింతగా పెంచేస్తున్నారు. రేపు డిసెంబర్ 9 న విడుదల కాబోయే ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని రాజమౌళి ఇప్పటికే తన క్లోజ్ సర్కిల్స్ కి చూపించారని ఇన్ సైడ్ టాక్.
ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూసిన వారు.. హాలీవుడ్ స్టాండ్స్ తో ఉంది అని.. రాజమౌళి దర్శకత్వాన్ని, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఎమోషనల్ యాక్టింగ్ ని, అలియా భట్, అజయ్ దేవగన్ ల కేరెక్టర్స్ ని పొగిడేస్తున్నారని, సినిమాలో బ్యాగ్ రౌండ్ మ్యూజిక్, ఆర్.ఆర్.ఆర్ యాక్షన్స్ సీన్స్, ఎన్టీఆర్ కొమరం భీం పెరఫార్మెన్స్, రామ్ చరణ్ అల్లూరి పెరఫార్మెన్స్ సూపర్ అంటున్నారు. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కెరీర్ లలో ఆర్.ఆర్.ఆర్ బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది అని, రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలు ఓ ఎత్తు.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ మరో ఎత్తు అనేలా ఉంది అని, హాలీవుడ్ సినిమాలతో పోల్చడం కాదు.. టెక్నీకల్ గా హాలీవుడ్ సినిమాలని సైతం దాటేసేలా ఉంది అంటూ ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూసిన వారు ట్రైలర్ పై మరింతగా అంచనాలు పెంచెయ్యడం చూస్తుంటే రేపు రాబోతున్న ట్రైలర్ పై ఫాన్స్ అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఫాన్స్ అంచనాలకు తగ్గనంత స్థాయిలో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఉండబోతుంది అని ఇన్ సైడ్ టాక్.