Advertisementt

జబర్దస్త్ కి హోల్ సేల్ షాక్

Sun 27th Mar 2022 01:17 PM
sudigali sudheer,getup srinu,ram prasad,jabardasth,roja,rashmi,anasuya,jabardasth show  జబర్దస్త్ కి హోల్ సేల్ షాక్
Wholesale shock to Jabardasth జబర్దస్త్ కి హోల్ సేల్ షాక్
Advertisement
Ads by CJ

ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో.. గురు, శుక్రవారాల్లో కామెడీ ప్రియులని తెగ ఎంటర్టైన్ చేస్తుంది. గురు వారం హైపర్ ఆది స్కిట్స్ తోనూ, శుక్రవారం సుడిగాలి సుధీర్ స్కిట్స్ తో కామెడీ ఫాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గతంలో నాగబాబు లాంటి జేడ్జ్, చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి కమెడియన్స్ వెళ్ళిపోయినా.. రోజా ఒంటి చేత్తో జబర్దస్త్ షో కి జేడ్జ్ గా ఆ షో ని లాక్కొస్తుంది. మనో తో కలిసి రోజా జబర్దస్త్ ని నడిపిస్తుంది. రాఘవ, హైపర్ ఆది, అభి, సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్, కెవ్వు కార్తీక్ ల సహాయంతో రోజా జబర్దస్త్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. అయితే ఈమధ్యన కొంతకాలంగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వీడుతున్నాడని, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లు కూడా సుధీర్ తో పాటే వెళ్లిపోతున్నారని టాక్ నడుస్తుంది. దానికి కౌంటర్ గా సుధీర్ జబర్దస్త్ ని వదలడం లేదు.. గ్యాప్ తీసుకుంటున్నాడంటూ గెటప్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

కానీ వచ్చే శుక్రవారం ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లు జబర్దస్త్ షో కి హోల్ సేల్ గా షాకివ్వనున్నట్లుగా తెలుస్తుంది. మేము ఛానల్స్ ద్వారానో.. లేదంటే వేరే ఇంటర్వూస్ ద్వారా చెప్పడం ఇష్టం లేదు, జబర్దస్త్ స్టేజ్ పైనే ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామని, మమ్మల్ని క్షమించమంటూ శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్ చెప్పడం చూసిన రోజా ఎమోషనల్ అయ్యింది. అంటే వాళ్ళు జబర్దస్ ని వీడుతున్నారనే న్యూస్ ని నిజం చేసినట్లుగా ఆ ప్రోమో కటింగ్ ఉంది. మరి అసలు విషయం ఏమిటి అనేది.. శుక్రవారం ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది.,

Wholesale shock to Jabardasth:

Sudigali Sudheer, Getup Srinu and Ram Prasad Quits Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ