Advertisementt

ప్రాంక్ అంటూ ఇంతటి నీచమా.. ఆశు.

Thu 09th Dec 2021 10:03 AM
ashu reddy,bigg boss fame,ashu pregnant,ashu reddy mother kicked  ప్రాంక్ అంటూ ఇంతటి నీచమా.. ఆశు.
Ashu Reddy Pregnant Prank Video ప్రాంక్ అంటూ ఇంతటి నీచమా.. ఆశు.
Advertisement
Ads by CJ

చాలామంది ప్రాంక్ కోసం చాలా వీడియోస్ చేస్తుంటారు.. చనిపోయామని, ఇంకా ఇంకా చాలానే వీడియోస్ చేసి.. చివరిలో ఇదంతా ప్రాంక్ అంటూ ప్రేక్షకులని బోల్తా కొట్టిస్తుంటారు.. అయితే ప్రాంక్ ఎంతవరకు ఉండాలి అనేది.. లిమిట్స్ క్రాస్ చేసి.. నీచమైన వీడియోస్ చేస్తే.. నెటిజెన్స్ తిట్టిన తిట్టకుండా తిడతారు.. ఇంతకూ ప్రాంక్ కోసం చేసిన ఆ నీచమైన పని ఏమిటి అంటే.. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యి.. ఈమధ్యన రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ హైలెట్ అయ్యి, స్టార్ మా కామెడీ షో లో స్టేజ్ పై కామెడీ చెయ్యడానికి ట్రై చేస్తున్న ఆశు రెడ్డి ప్రాంక్ వీడియో అంటూ తన అమ్మ చేతిలోనే దెబ్బలు తిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియో లో ఆశు రెడ్డి సోఫాలో కూర్చుని ఏడవడంతో.. ఆమె తల్లి ఏమైంది అని ప్రశ్నించగా.. నాకు పిరియడ్స్ రాలేదు.. టెస్ట్ చేసుకుంటే దానిలో ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది అంటూ చెప్పడంతో.. ఆశు రెడ్డి తల్లి షాకైంది.. అలాగే ఆమె ఫ్రెండ్ కూడానమ్మలేదు. జోక్ చేస్తోందని అనుకున్నారు. కానీ ఆశు రెడ్డి ఏడుస్తూ జీవించేసరికి ఫ్యామిలీ అంత ఆశు నిజంగానే ప్రెగ్నెంట్ అని నమ్మేసారు.. ఆతర్వాత ఆశు తల్లి ఇంకెందుకు.. ఏమైనా తాగి చద్దాం.. నిన్ను ఇలా పెంచినందుకు నన్నే అంటారు అని అనడమే కాదు కోపంతో.. ఆశు రెడ్డిని కొట్టడం, కాలితో తన్నడం చేశారు ఆవిడ. ఆశు రెడ్డి తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడటం చూసిన వారు నిజమనే నమ్మేశారు.

తర్వాత ఆశు ఇదంతా ప్రాంక్ అని ఇదంతా కెమెరాలో రికార్డ్ చేసినట్లుగా ఆమె తల్లికి చెప్పడంతో ఆమె మరింత కోపానికి గురై.. ఇలాంటివి ఫ్రాంక్ ఏమిటి అంటూ ఇంకా రెండు ఆశు ని కొట్టింది.

మరి ప్రాంక్ వీడియోస్ అంటూ ఇలాంటి నీచమైన పని చెయ్యడంతో కెరియర్ కూడా దెబ్బ తింటుందంటూ ఆశు రెడ్డిని నెటిజెన్స్ తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు.

Ashu Reddy Pregnant Prank Video:

Ashu Reddy Pregnant Her Mother Kicked Out Video Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ