ఈ టీవీలో పదమూడేళ్లుగా.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఢీ డాన్స్ షో.. ప్రస్తుతం 13 సీజన్స్ ని పూర్తి చేసుకుంది.. ఈ డాన్స్ షో నుండి చాలామంది స్టార్ కొరియోగ్రాఫర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్.. ఇలా ఢీ నుండి వచ్చినవారే. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రన్ అవుతున్న ఢీ డాన్స్ షో లో ప్రతి ఏడాది.. గ్రాండ్ ఫినాలే కి ఎవరో ఓ గెస్ట్ రావడం.. వాళ్ళ చేతుల మీదుగా గ్రాండ్ ఫినాలేలో గెలిచిన కంటెస్టెంట్ కి ట్రోఫీ ఇవ్వడం చూస్తున్నాం.. ఇలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సీజన్ కి, ప్రభుదేవా ఇంకో సీజన్ కి గెస్ట్ లుగా రాగా.. తాజాగా ఢీ కింగ్స్ vs క్వీన్స్ గ్రాండ్ ఫినాలే కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిధిగా వచ్చాడు.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని పాటలను గ్రాండ్ ఫినాలేలో అల్లు అర్జున్ కి ట్రిబ్యూట్ ఇవ్వగా.. అల్లు అర్జున్ ఆద్యంతం ఆకట్టుకునే డైలాగ్స్ తో అదరగొట్టేసాడు.. అల్లు అర్జున్ ఎంట్రీ తర్వాత ప్రదీప్, హైపర్ ఆది, గణేష్ మాస్టర్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ ని కాస్త అతిగానే పొగిడేశారు కానీ.. అల్లు అర్జున్ మాత్రం హుందాగా.. జోక్స్ వేస్తూ ఢీ కింగ్స్ వైస్ క్వీన్స్ గ్రాండ్ ఫినాలే ప్రోగ్రాం పై హైప్ క్రియేట్ చేసారు. ప్రియమణి ని బాగా సన్నబడ్డావ్ పైగా హాట్ గా ఉన్నావ్ అంటే.. పూర్ణ గారు ఇంకా బాగా డాన్స్ చేస్తే అంటూ ఏడిపించడం, ఆది నువ్ జబర్దస్త్ కదా.. డాన్స్ షో లో ఏం పని అంటూ అబ్బో చాలా కామెడీ చేసాడు. ఇక గ్రాండ్ ఫినాలేలో పోటీ పడిన కావ్య-కార్తిక్ లు తమ డాన్స్ విన్యాసాలు, ఫేస్ ఎక్సప్రెషన్స్ తో అదరగొట్టేసాడు. అయితే కావ్య-కార్తిక్ లలో కావ్య డాన్స్ కి ఫిదా అయిన అల్లు అర్జున్ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ఢీ డాన్స్ కింగ్ వైస్ క్వీన్స్ ట్రోఫీ క్వీన్స్ కావ్యకి అందజేశారు.
అంతేకాకుండా ఓడిపోయిన కార్తిక్ కి హాగ్ ఇచ్చి మరీ నేను ఓసారి ఓడిపోయాను.. ఓడిపోయాను అని బాధపడొద్దు నేను రిహార్సల్స్ చేసేటప్పుడు నా దగ్గరకి రా అంటూ కార్తిక్ చెప్పడమే కాదు.. ఢీ తదుపరి సీజన్‌ని ప్రకటించి.. దాని టైటిల్‌ని అల్లు అర్జున్ లాంచ్ చేశారు. ఢీ తదుపరి సీజన్ ఢీ ది డ్యాన్స్ ఐకాన్ అంటూ అల్లు అర్జున్ అనౌన్స్ చేసారు.