ఈ రోజు అందరూ అంటే సినిమా సెలబ్రిటీస్ అందరూ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 9 న రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పై సినీ ప్రముఖులు వరస బెట్టి ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు రాజమౌళి మేకింగ్ ని ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్ పెరఫార్మెన్స్, రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, స్టార్స్ హీరోస్ నటన అన్నిటిని వెయ్యినోళ్లతో పొగిడేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూసిన చిరు వెంటనే.. ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించిందనీ .. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటానని ట్వీట్ చేసారు.
మరోపక్క హీరోయిన్ సమంత.. రామ్ చరణ్ అల్లూరి గెటప్, ఎన్టీఆర్ కొమరం భీం పిక్స్ ని పోస్ట్ చేస్తూ.. ది బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ హేవ్ సీన్ ఆన్ స్క్రీన్ @AlwaysRamCharan, 100 శాతం ఇది నిజం అనుకుంటున్నట్లు తెలిపింది. తారక్ కళ్ళల్లో ఫైర్ ఉంది.. అతడు ఏమైనా చేయగలడు అని I believed that this was real 100 percent .. there was absolutely no doubt .. @tarak9999 you can do anything with that fire in your eyes FireFireFire #RRRTrailer అంటూ పులితో చేసే ఫైట్ పిక్ ని పోస్ట్ చేసింది.. మరి చిరు, సమంతానే కాదు.. పూజ హెగ్డే, విజయ్ దేవరకొండ, ఇంకా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, బాలీవుడ్ బడా మేకర్స్ కూడా ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ అదిరిపోయింది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.