Advertisementt

బిగ్ బాస్ సీజన్ 5 పై బెట్టింగ్స్

Fri 10th Dec 2021 11:54 AM
vj sunny,shanmukh,winner of bigg boss telugu,bigg boss telugu 5,bigg boss,nagarjuna  బిగ్ బాస్ సీజన్ 5 పై బెట్టింగ్స్
Betting on Bigg Boss Season 5 బిగ్ బాస్ సీజన్ 5 పై బెట్టింగ్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే 14 వారలు పూర్తి చేసుకోబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి రెండు వారాల్లో ఎవరు టాప్ 5 కి వెళతారు, ఎవరు విన్ అవుతారో అనే ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది. సన్నీ - షణ్ముఖ్ లలో బిగ్ బాస్ విన్నర్ ఒకరయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా సోషల్ మీడియా లో టాక్ ఉంది. సన్నీ టాస్క్ ల పరంగా ఆకట్టుకోగా.. షణ్ముఖ్ బయట ఫాన్స్ బేస్ తో విన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరోపక్క బిగ్ బాస్ సీజన్ 5 లో ఎవరు విన్ అవుతారో అనే విషయంలో ఇప్పుడు బెట్టింగ్ లు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. 

క్రికెట్ బెట్టింగ్స్, పొలిటికల్ బెట్టింగ్స్ విన్నాం కానీ.. బిగ్ బాస్ బెట్టింగ్స్ అనేది మాత్రం ఫస్ట్ టైం వింటున్నాం. బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ గెలుస్తాడని, షణ్ముఖ్ గెలుస్తాడని, శ్రీరామ చంద్ర గెలుస్తాడంటూ.. బయట యూత్ బెట్టింగ్స్ లకి పాల్పడిన విషయం తెలుసుకున్న పోలీస్ లు వాళ్ళని అదుపులోకి తీసుకుని.. ఐదు సెల్ ఫోన్స్, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న ఘటన ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 పై మరింతగా అంచనాలు పెంచేస్తుంది.. నిన్నమొన్నటివరకు వీక్ టీఆర్పీ తో చప్పగా సాగిన బిగ్ బాస్ సీజన్ 5.. ఇప్పుడు ఈ బెట్టింగుల వ్యవహారంతో బాగా హైలెట్ అవుతుంది. 

ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సన్నీ - షణ్ముఖ్ ల చేతులలో నాగార్జున సన్నీ చెయ్యి ఎత్తి పెట్టిన పిక్ ఒకటి తయారు చేసి సన్నీ విన్నర్ అంటూ సన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Betting on Bigg Boss Season 5:

VJ Sunny or Shanmukh Winner Of Bigg Boss Telugu Season 5?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ