బిగ్ బాస్ సీజన్ 5 14 వారాలు పూర్తి చేసుకుని.. 15 వ వారంలో, ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టబోతుంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ట్ అయ్యాక మొదటి వారంలో సరయు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ నుండి వెళ్లగా.. తర్వాత మరో 12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 14 వారం చివరిగా బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పై అందరిలో క్యూరియాసిటీ మొదలైపోయింది. ఉన్న ఆరుగురిలో శ్రీరామ్ చంద్ర టాప్ 5 లో ఉన్నాడు. సన్నీ, మానస్, కాజల్, సిరి, షణ్ముఖ్ లలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి చివరి కంటెస్టెంట్ గా నిలుస్తున్నారో అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది.
అయితే ఈ వారం సన్నీ - షణ్ముఖ్ లు ఒకరోజు ఒకరు టాప్ లో ఉంటే.. మరొకరోజు మరొకరు ఓటింగ్ లో టాప్ లో ఉంటున్నారు. మూడో స్థానం లో మొన్నటివరకు కాజల్ తర్వాత మానస్ ఉండగా.. శ్రీరామ్ చంద్రతో గొడవ తర్వాత కాజల్ చివరి స్థానంలోకి వెళ్ళిపోయింది.. ఇక ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న సిరి.. అనూహ్యంగా మూడో స్థానానికి వచ్చింది. అయితే ఇప్పుడు టాప్ లో ముగ్గురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడని, ఎవరు లీస్ట్ లో ఉన్నా.. లేడీస్ ని టాప్ 5 కి పంపేసి.. స్ట్రాంగ్ ప్లేయర్ ని మాత్రం ఎలిమినేషన్ కి సిద్ధం చేసినట్లుగా.. ఇదే ఈ వారం ట్విస్ట్ అంటున్నారు. ఈ వారం ఓటింగ్ ముగిసే నాటికి షణ్ముఖ్, సన్నీలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. సిరి హన్మంత్ మూడో స్థానంలో నిలిచిందని అంటున్నారు. ఇక కాజల్ కూడా కూడా చివరి ప్లేస్ నుండి శుక్రవారం ఓటింగ్‌లో భారీగా పుంజుకుందని తెలుస్తోంది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న మానస్ చివరి స్థానానికి పడిపోయి.. ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నాడని అంటున్నారు.
మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం కూడా సిరి, కాజల్ ని టాప్5 లోకి పంపేసి.. మానస్ నే ఎలిమినేట్ చెయ్యాలనే నిర్ణయంలో ఉన్నట్లుగా టాక్. శ్రీరామ్ చంద్ర, సన్నీ, షణ్ముఖ్ లు ఎలాగూ టాప్ 5 కి వెళతారని, కానీ సిరి, కాజల్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే.. ఈ వారం ఒక్క లేడీ కంటెస్టెంట్ మాత్రం టాప్5 కి వెళుతుంది.. అలా కాకుండా మానస్ ని ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు జరుగుతూన్నాయని తాజా సమాచారం.