తమిళ హీరో శింబు తీవ్ర అస్వస్థతకు గురవడంతో శనివారం సాయంత్రం ఆయనని చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. శింబు రెండు రోజులుగా జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి తో బాధపడుతూనే గౌతమ్ మీనన్ వెందు తనిందదు కాడు షూటింగ్‌లో పాల్గొండడంతో.. షూటింగ్ స్పాట్ లోనే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడంతో వెంటనే శింబు ని చెన్నై లోని ఆసుపత్రికి తరలించారు. జలుబు, ఫీవర్, గొంతునొప్పి ఉండడంతో.. శింబుకి ఆసుపత్రి లో డాక్టర్స్ సాధారణ టెస్ట్ లతో పాటుగా.. కోవిడ్ సంబంధించి టెస్టులు కూడా నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం శింబు ఆరోగ్యం బాగానే ఉంది అని.. ఆయనికి శనివారం రాత్రే డాక్టర్స్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపేసినట్లుగా తెలుస్తుంది.
ఈమధ్యనే శింబు మానాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హీరోగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న శింబు మరోసారి.. బిజీ అయ్యాడు. ప్రస్తుతం గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెందు తనిందదు కాడు షూటింగ్‌లో విరామం లేకుండా పాల్గొంటున్నాడు. ఆ షూటింగ్ లో శింబు చాలా మంది ఆర్టిస్టులతో కలిసి చేస్తున్నాడు. అలాగే షూటింగ్స్ లో విశ్రాంతి లేకుండా పాల్గొనడం వలన శింబు అస్వస్థతకు గురయ్యాడని, ఎక్కువమందితో పని చేసిన కారణంగా శింబు కి ఇన్ఫెక్షన్ సోకి ఆరోగ్యం పాడైంది అని, ప్రస్తుతం శింబు బావున్నాడని మరో హీరో మహత్ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో ఆయన ఫాన్స్ కూల్ అయ్యారు.