Advertisementt

సుధీర్-రష్మీ అవుట్, అఖిల్-మోనాల్ ఇన్

Sun 12th Dec 2021 07:44 PM
sudhir,rashmi,akhil,monal,monal gajjar,akhil sardhak,rashmi gautham,sudigali sudheer,dhee dance show,dhee season 14th  సుధీర్-రష్మీ అవుట్, అఖిల్-మోనాల్ ఇన్
Sudheer - Rashmi out, Akhil - Monal Win సుధీర్-రష్మీ అవుట్, అఖిల్-మోనాల్ ఇన్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ స్టార్ట్ అయ్యాక కొన్నాళ్ళకి రష్మీ యాంకర్ గా రావడం.. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ తో సుడిగాలి సుధీర్ తో స్నేహం, పరిచయం, ప్రేమ అంటూ సుధీర్, రష్మీ గౌతమ్ మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ ప్రచారం జరగడం, అది బాగా వర్కౌట్ అయ్యి.. ఈటివి వారికి కలిసొచ్చింది. జబర్దస్త్ జేడ్జ్ రోజా కూడా వారిమధ్యన ఏదో ఉన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం, అలాగే చాలా ఈవెంట్స్ లో వారికి పెళ్లి అంటూ అనడమే కాదు.. ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి పెళ్లిళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక అదే జోడితో ఢీ డాన్స్ షో లోను రష్మీ - సుదీర్లు బాగా ఫెమస్ అయ్యారు. 

అయితే ఇప్పుడు సుధీర్ - రష్మీ జోడీని తప్పించి ఢీ డాన్స్ షో యాజమాన్యం వాళ్ళ ప్లేస్ లోకి బిగ్ బాస్ లో లవర్స్ గా ప్రొజెక్ట్ అయ్యి బాగా పాపులర్ అయ్యి, బయట ఈమధ్యన ప్రోగ్రామ్స్ తో ఫెమస్ అయిన అఖిల్ సార్థక్, గ్లామర్ గర్ల్ మోనాల్ గజ్జర్ లు.. ఢీ డాన్స్ 14th సీజన్ కి మెంటర్ గా రాబోతున్నారు . హైపర్ అది తో పాటుగా అఖిల్ సార్థక్ ఉండగా.. మోనాల్ గజ్జర్ మరో లేడీ మెంటర్ గా వస్తుంది. మరి అఖిల్ - మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ లో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యి, బయట కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేసిన జంట.. మరి వాళ్ళ పాపులారిటీ ఢీ డాన్స్ షో కి బాగా పనికొస్తుంది. అందుకే మల్లెమాల వాళ్ళని పట్టేసి.. ఫ్రెష్ లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తుంది. సో సుధీర్ రష్మీ అవుట్.. వాళ్ళ ప్లేస్ లోకి అఖిల్ - మోనాల్ విన్ అన్నమాట. 

Sudheer - Rashmi out, Akhil - Monal Win :

Sudhir-Rashmi couple out .. Akhil-Monal pair in

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ