Advertisementt

కంగనాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కత్రినా-విక్కీ

Sun 12th Dec 2021 09:16 PM
kangana ranaut,katrina kaif,vicky kaushal,katrina kaif and vicky kaushal wedding celebrations  కంగనాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కత్రినా-విక్కీ
Katrina and Vicky sent a gift to Kangana Ranaut కంగనాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కత్రినా-విక్కీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్యూట్ కపుల్.. కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఓ ఫోర్ట్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు మీడియాకి కానీ ఎవరికీ తమ పెళ్లి ఇంఫార్మేషన్ ఇవ్వని ఈ జంట.. పెళ్లి అవ్వగానే సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోస్ షేర్ చేసి ఆశీర్వాదాలు అడిగారు. ఇక పెళ్లైన రెండు రోజుల తర్వాత కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల మంగళ స్నానాలు, సంగీత్, మెహింది ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. చాలా ఉత్సాహంగా, హుషారుగా కత్రినా అండ్ విక్కీ కౌశల్ లు తమ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని కుటుంబ సభ్యుల మధ్యన ఎంజాయ్ చేసారు.

అయితే తాజాగా కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు తాము ఆహ్వానించని సెలబ్రిటీస్ కి ప్రత్యేకంగా పెళ్లి తర్వాత గిఫ్ట్ లు పంపడం హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ లో పెద్దగా సెలబ్రిటీస్ ని తమ వివాహానికి ఆహ్వానించలేదు. కోవిడ్ రెస్టిక్షన్, అలాగే కొద్దిమంది అతిధుల మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తమకి కావల్సిన ఆప్తులకి, దగ్గర వారికి, సెలబ్రిటీస్ కి గిఫ్ట్ లు పంపిన విషయం కంగనా ద్వారానే తెలిసింది. కంగనా రనౌత్ కి విక్కీ - కత్రినాలు అదిరిపోయే గిఫ్ట్ పంపిన విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సువాసనతో కూడిన పువ్వులు, రుచికరమైన నేతి లడ్డూలు పంపించినందుకు థ్యాంక్యూ విక్కీ-కత్రినా. కంగ్రాట్స్‌ అంటూ షేర్ చెయ్యడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ అయ్యింది.

పెళ్ళికి వెళ్లిన సన్నిహితులకు, అతిదులకి విక్కీ - కత్రినా కైఫ్ జంట ప్రత్యేకంగా రిటర్న్ గిఫ్ట్ లు కూడా ఇచ్చింది. నాలుగు రకాల పంజాబీ స్వీట్స్‌, థ్యాంక్యూ లెటర్‌ ఉంచి మా ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రయాణం చేసి మా పెళ్లి వేడుకల్లో భాగమైన మీ అందరికీ ధన్యవాదాలు.అంటూ ఆ గిఫ్ట్ బాక్స్ లు అందించింది ఈ జంట.

Katrina and Vicky sent a gift to Kangana Ranaut:

Kangana Ranaut thanks Katrina Kaif and Vicky Kaushal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ