ఈటీవీలో గత తొమ్మిదేళ్లుగా.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డ్స్ అంటూ.. కామెడీ ప్రియులని ఎంటర్టైన్ చేస్తున్న షోస్.. టీఆర్పీలో ఎప్పుడూ బెస్ట్ షోస్ గానే నిలిచాయి.. ఎన్ని కామెడీ షోస్ వచ్చి జబర్దస్త్ కి చెక్ పెడదామనుకున్నా జబర్దస్త్ ని బీట్ చెయ్యలేక చేతులెత్తేశాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, కెవ్వు కార్తిక్, రాఘవ, తాగుబోతు రమేష్ లాంటి వారు.. జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. అయితే మొన్నామధ్యన చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటివారు జబర్దస్త్ వదిలేసి పక్క ఛానల్ కి పోయారు. ఇక అవినాష్ లాంటి వారు బిగ్ బాస్ షో తర్వాత ఈటీవికి దూరమయ్యాడు.
ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్ట్ లు చాలామంది జబర్దస్త్ లో కనబడుతున్నారు. ఫైమా, పవిత్ర లాంటి వాళ్ళు కాకుండా, సీరియల్స్ నుండి లేడీస్ ని తీసుకొచ్చేస్తున్నారు. అలాగే కొత్త స్కిట్స్ లో కొత్త మొహాలు కనబడుతున్నాయి. సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వెళ్లిపోతున్నారని ప్రచారం జరుగుతుంటే.. ఇక వాళ్ళు లేకపోతె స్కిట్స్ రన్ టైం తగ్గిస్తారో.. లేదంటే కొత్త కమెడియన్స్ కి అవకాశాలు ఇస్తారో అనేస్తున్నారు. కానీ సుధీర్ వాళ్ళు వెళ్లడం లేదని స్టేజ్ పైనే చెప్పేసారు. అయినప్పటికీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ల్లో ఎంతమంది కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తారో అంటున్నారు.. ఆ వచ్చే కొత్తవారు గనక బెస్ట్ ఇవ్వకపోతే షో రేటింగ్ ఆటోమాటిక్ గా పడిపోతుంది.