బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఆర్జే గా అడుగుపెట్టిన కాజల్.. తర్వాత గొడవలు, స్ట్రాటజీతో బాగా హైలెట్ అయ్యింది. కాజల్ ఫ్రెండ్ సన్నీ అన్నట్టుగా ఆత్రం ఆగదు అస్సలు కాజల్ కి. నిజమే.. ముందు ముందు మాట్లాడేసి అన్నిటిలో నెగెటివిటీని మూటగట్టుకున్న కాజల్ పై ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ యాజమాన్యమే ఫైర్ అవుతుంది అంటే.. కాజల్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా తన ఆత్రాన్ని ఆపుకోలేకపోయింది అనేది అర్ధమవుతుంది. ఇంతకుముందు ఎన్నడూ.. బిగ్ బాస్ చరిత్రలోనే జరగని పనిని చేసి కాజల్.. బిగ్ బాస్ యాజమాన్యంతో తిట్లు తిన్నట్టుగా తెలుస్తుంది.
విషయం ఏమిటి అంటే.. బిగ్ బాస్ లో సోమవారం జరిగేది మంగళవారం టివిలో ప్రసారం అవుతుంది. అంటే శనివారమే హౌస్ మేట్స్ అంతా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేస్తే .. ఆ ఈవెంట్ ని స్టార్ మా ఆదివారం ప్రసారం చేస్తుంది. ఇక ఆదివారం ఎపిసోడ్ ని శనివారమే షూట్ చేసి.. ఆదివారం ప్రసారం చేస్తుంది. ఆదివారం ఎలిమినేట్ అయ్యే సభ్యులు శనివారమే ఇంటి నుండి బయటికి వచ్చేసి.. చడీ చప్పుడు లేకుండా ఆదివారం ఎపిసోడ్ పూర్తయ్యాకే బయటికి వస్తారు. అది బిగ్ బాస్ మెయిన్ రీఓల్. ఇక ఆదివారం ఎలిమినేషన్స్ శనివారమే లీకైపోయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసేవి. అది వేరే విషయం.
ఇక్కడ కాజల్ శనివారం చివరి హౌస్ మేట్ గా ఎలిమినేట్ అయ్యి బయటికివచ్చింది.. ఆదివారం నైట్ 10.30 వరకు కామ్ గా ఉండాల్సిన కాజల్.. ఆదివారం ఉదయమే యూట్యూబ్ ఛానల్ లైవ్ లోకొచ్చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం బిగ్ బాస్ యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. నైట్ రావాల్సిన కాజల్ ఉదయమే ఛానల్స్ లో కనిపించేసరికి ఖంగుతిన్న బిగ్ బాస్ యాజమాన్యం కాజల్ పై ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది.