Advertisementt

సమంత స్పెషల్ సాంగ్ పై కేసు నమోదు

Mon 13th Dec 2021 07:42 PM
samantha,case filed,allu arjun,pushpa,samantha special song  సమంత స్పెషల్ సాంగ్ పై కేసు నమోదు
Case filed against Samantha special number in Pushpa సమంత స్పెషల్ సాంగ్ పై కేసు నమోదు
Advertisement
Ads by CJ

ఏ మాయ చేసావే దగ్గర నుండి నిన్నమొన్నటి శాకుంతలం పాన్ ఇండియా మూవీ వరకు కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సమంత.. పర్సనల్ లైఫ్ లో చైతు తో విడాకుల మేటర్ తో బాధపడినా.. మళ్ళీ కెరీర్ లో పని పని అంటూ బిజీ అవుతూ.. అల్లు అర్జున్ తో ఫస్ట్ టైం ఓ స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్స్ తో కాలు కదపడం హైలెట్ అయ్యింది. పుష్ప పాన్ ఇండియా మూవీలో సమంత - అల్లు అర్జున్ ల ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావా మాస్ స్పెషల్ సాంగ్ ఇప్పడు యూట్యూబ్ లోనే కాదు.. ఐదు భషాల్లోనూ మార్మోగిపోతోంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మోస్ట్ వ్యూడ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియా అంటూ రికార్డ్ క్రియేట్ చేసి, 14 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సాంగ్ పై ఇప్పుడు కేసు నమోదు అయ్యింది.

విపరీతంగా పాపులర్ అయిన సాంగ్ పై ఇప్పుడు కేసు నమోదు అవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సాంగ్ లిరిక్స్ రిలీజ్ అయిన రోజు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల విషయంలో మగవారంతా చెడ్డవారే, శృంగారమే వారికి కావాల్సింది అని అర్థం వచ్చేలా ఈ లిరిక్స్ ఉన్నాయి... అంటూ ఆంధ్రప్రదేశ్ లో సమంత ఐటెం సాంగ్ పై పురుషుల అసోసియేషన్ కేసు నమోదు చేసింది. మగవారిపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్న ఈ పాటని బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. మరి కెరీర్ లోనే మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసిన సమంత సాంగ్ పై కేసు నమోదు కావడం ఆమె అభిమానులకు షాకిస్తుంది.

Case filed against Samantha special number in Pushpa:

Case Filed Against Allu Arjun Pushpa For Samantha Special Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ