పుష్ప పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ కి జోడిగా డిగ్లామర్ కాదు రాలుక్ లో అదరగొట్టిన రష్మిక మందన్న.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను, రష్మిక స్పెషల్ ఇంటర్వూస్ లో శారీ లుక్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఫిట్ నెస్ బాడీ తో గ్లామర్ గా కనబడుతున్న రష్మిక.. అల్లు అర్జున్ తో ఎప్పుడో నటించాలని అనుకుందట. తాను నటించిన గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ టైములో అల్లు అర్జున్ తో జోడి కట్టాలనిపించింది అని.. అది పుష్ప తో తీరింది అని చెప్పిన రష్మిక అల్లు అర్జున్ తో 100 సినిమాలైనా చేయాలని ఉందని చెబుతూనే.. శ్రీవల్లి గా పుష్ప రాజ్ తో కెమిస్ట్రీ ఎలా కుదిరిందో ట్రైలర్ లోనే చూసారు.. సినిమాలో ఇంకా అదిరిపోతోంది అని చెబుతుంది.
ఇక సమంత పుష్ప లో చేసిన ఐటెం సాంగ్ పై స్పందించింది. సమంత - అల్లు అర్జున్ కలిసి ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ.. సాంగ్ చిత్రీకరణ పూర్తయ్యక సమంతకి మెస్సేజ్ చేశాను.. సూపర్ గా చేసావ్ అని, సమంత చేసిన స్పెషల్ సాంగ్ సినిమాలో హైలైట్ అవుతుంది. ఈ సాంగ్ లో సమంత ఎక్స్ ప్రెషన్స్ చూసి నేను షాక్ అయ్యాను. టాప్ హీరోయిన్ గా రాణిస్తూ స్పెషల్ సాంగ్స్ లో నటించడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అవకాశం నాకొస్తే.. చేయాలనుంటుంది. ప్రస్తుతం అయితే నాకు మాత్రం స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన లేదు అంటూ పుష్ప ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక స్పెషల్ సాంగ్స్ పై తన ఒపీనియన్ చెప్పింది. మరి గతంలో కాజల్ అగర్వాల్, తమన్నా, పూజ హెగ్డే లాంటి వాళ్ళు.. టాప్ హీరోయిన్స్ గా ఉన్నప్పుడే స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ రష్మిక ఏంటో ఆలా అనేసింది అంటున్నారు నెటిజెన్స్.