పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేసారు పుష్ప మేకర్స్ మైత్రి మూవీస్ వారు. అయితే ఆదివారం రాత్రి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ అభిమానుల మధ్యన కోలాహలంగా జరిగింది. ప్రస్తుతం మరోసారి కోవిడ్ పంజా విసురుతున్న నేపథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద భారీగా జనసమూహం పొగవడం పై జూబ్లీహిల్స్ పోలీస్ లు ఈవెంట్ నిర్వాహకులు, పుష్ప మేకర్స్ పై కేసు నమోదు చేసారు. అలాగే ఈవెంట్ సమయంలో ఫాన్స్ మధ్యన తోపులాట జరగడం, అక్కడ తొక్కిసలాటలో బన్నీ ఫాన్స్ కొందరు గాయపడిన విషయాన్ని లేట్ గా తెలుసుకున్న పోలీస్ లు ఈవెంట్ నిర్వాహకులు, మేకర్స్ పై కేసు నమోదు చేసారు.
లెక్కకు మించి అభిమానులకు ఈవెంట్ నిర్వాహకులు పాస్ లు జారీ చెయ్యడం వలనే ఇంత గందరగోళం జరిగింది అని పోలీస్ లు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఈ రోజు సోమవారం జూబ్లీహిల్స్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ లో అల్లు అర్జున్ ఫాన్స్ ని ఆహ్వానించాడని.. భారీ ఎత్తున అభిమానులు తరలి రావడం, అక్కడికి అల్లు అర్జున్ రావడం లేదని తెలుసుకుని నిరాశపడిపోయారు. ఇక గీత ఆర్ట్స్ ఆఫీస్ కి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలుసుకున్న పోలీస్ లు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా చూసుకున్నారు.