Advertisementt

బిగ్ బాస్ 5: సన్నీనే విన్నర్ అనడానికి సాక్ష్యం

Tue 14th Dec 2021 07:10 AM
bigg boss,bigg boss telugu,sunny,bigg boss season 5 winner,bigg boss season telugu 5 winner  బిగ్ బాస్ 5: సన్నీనే విన్నర్ అనడానికి సాక్ష్యం
Bigg Boss 5: Evidence that Sunny is the winner బిగ్ బాస్ 5: సన్నీనే విన్నర్ అనడానికి సాక్ష్యం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే వీక్ లో టాప్ 5 లో ఉన్న వారి జర్నీలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. సోమవారం ఎపిసోడ్ లో శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి.. చివరి వారం వరకు అతని బిగ్ బాస్ జర్నీ.. బెస్ట్ ఫోటో మూమెంట్స్ ని చూపించారు. అలాగే మరో కంటెస్టెంట్ మానస్ బిగ్ బాస్ జర్నీ ని కూడా రాత్రి ఎపిసోడ్ లో చూపించేసారు. అయితే ఇప్పుడున్న ఐదుగురిలో ఎవరు విన్ అవ్వబోతున్నారు, ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి,మానస్ లు ఉన్న టాప్ 5 లో ఎక్కువగా సన్నీనే విన్నర్ అవుతారని అంటున్నారు. ఈ ఆదివారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వెళ్లిన కాజల్.. బయట అరుస్తూ సన్నీని విన్నర్ ని చెయ్యమని, సన్నీ కి ఓట్స్ వెయ్యమని క్యాంపెనింగ్ మొదలు పెట్టింది.

మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అతని ఫాన్స్ ఓట్స్ తో షణ్ముఖ్ గెలిచినా గెలవొచ్చు.. కానీ అతను బిగ్ బాస్ హౌస్ లో సిరి తో చేసిన రచ్చ పై చాలామంది ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ లో అట తీరు కన్నా.. బయట వాళ్లకు వచ్చిన ఓట్స్ తోనే బిగ్ బాస్ సీజన్ విన్నర్ ని ఫైనల్ చేస్తున్నారు నిర్వాహకులు. మరి ఫ్యాన్ బేస్ తో షణ్ముఖ్ విన్నర్ అయినా.. అందులో మాత్రం మజా ఉండదు.. సన్నీనే విన్నర్ అవ్వాలి.. మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సన్నీ విన్నర్.. ఫస్ట్ డే ఓటింగ్స్ చెబుతున్నాయి. సోమవారం ఓటింగ్స్ లో సన్నీ నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు.. ఓటింగ్ లో చివరి స్థానంలో సిరి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఫైనల్ గా సన్నీనే  విన్నర్ అని ఈ రోజు ఓటింగ్స్ చెబుతున్నాయ్.. చూద్దాం ఆదివారం గ్రాండ్ ఫినాలేలోఎం జరుగుతుందో అనేది.

Bigg Boss 5: Evidence that Sunny is the winner:

Meet The Winner And Runner Up Of Bigg Boss Telugu 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ