Advertisementt

రాధేశ్యామ్ సీక్రెట్స్ రివీల్

Wed 15th Dec 2021 12:46 PM
radhe shyam,radhe shyam pre-release event,prabhas,pooja hegde,radhakrishna kumar,uv creations,prabhas fans,radhe shyam trailer  రాధేశ్యామ్ సీక్రెట్స్ రివీల్
Radhe Shyam secrets revealed రాధేశ్యామ్ సీక్రెట్స్ రివీల్
Advertisement
Ads by CJ

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ - పూజ హెగ్డే నటించిన రాధేశ్యామ్ మూవీ జనవరి 14 న రిలీజ్ కాబోతుంది.. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మార్కెట్ లో హడావిడి చేస్తున్నాయి. ఇక ఈ నెల 23 న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమ చేస్తున్నారట. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఓ రేంజ్ లో నిర్వహించబోతున్నారట మేకర్స్.. ఇక తాజాగా రాధాకృష్ణ మట్లాడుతూ రాధేశ్యామ్ సీక్రెట్ ని రివీల్ చేసాడు. కథ అనుకుని 15 ఏళ్లయ్యింది అని.. ఇప్పటికి అది  కార్యరూపం దాల్చడానికి ఓ సీక్రెట్ ఉన్నా అది ఇప్పుడు చెప్పను అన్నారు రాధాకృష్ణ

రాధేశ్యామ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ఉండబోతుంది అని, అమ్మాయి - అబ్బాయి మధ్యలో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే కాకుండా  రాధేశ్యామ్ మూవీ ని లైఫ్ అండ్ డెత్ మధ్య సాగే సెలబ్రేషన్‌గా చూపించబోతున్నట్లుగా రాధాకృష్ణ చెప్పారు. అయితే ఈ రోజుల్లో జాతకాలను నమ్మేవాళ్లున్నారు. అలాగే నమ్మని వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ అందులో నిజమెంత.. అబద్ధం ఎంత.. అనే కథకి క్యూట్ లవ్ స్టోరీని యాడ్ చేస్తే అదే రాధేశ్యామ్ స్టోరీ అంటూ రాధేశ్యామ్ సీక్రెట్స్ ని బయట పెట్టారు రాధాకృష్ణ. ఇక ఈ సినిమా కి వింటేజ్ లుక్‌తో పాటు యూరప్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకోవాలనేది మాత్రం ప్రభాస్ ఆలోచనే అంటూ ఆ క్రెడిట్ రాధాకృష్ణ ప్రభాస్ కె ఇచ్చేసాడు.

Radhe Shyam secrets revealed :

Radhe Shyam pre-release event and trailer treat on

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ