Advertisementt

బాలయ్య షో లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్

Wed 15th Dec 2021 01:05 PM
balakrishna,ah ott,aha video,nbk unstoppable,rajamouli,keeravani,ntr,ram charan  బాలయ్య షో లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్
RRR Director Rajamouli to enter Balakrishna Unstoppable బాలయ్య షో లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్
Advertisement
Ads by CJ

నందమూరు నటసింహం బాలకృష్ణ అఖండ సక్సెస్ టూర్ అంటూ ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. బోయపాటి, నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి తో కలిసి బాలకృష్ణ విజయవాడ దుర్గా మాతని, మంగళ గిరి లక్ష్మి నరసింహ స్వామిని, పెదకాకాని శివయ్యని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ఇక ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోలో బాలయ్య అదరగొట్టేస్తున్నారు. మంచు ఫ్యామిలీతో మొదలు పెట్టి హీరో నాని, బ్రహ్మానందం రీసెంట్ గా అఖండ టీం తో అన్ స్టాపబుల్ ఆడించిన బాలయ్య నెక్స్ట్ గెస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి అతిధులుగా వచ్చారు. మరి రాజమౌళి తో చెయ్యబోయే బాలకృష్ణ ఆర్.ఆర్.ఆర్ అన్ స్టాపబుల్ షో కి ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా మధ్యలో యాడ్ అవ్వొచ్చనే ఊహాగానాలు అభిమానుల్లో మొదలైపోయాయి.

మోహన్ బాబు టైం లో మంచు లక్ష్మి, మంచు విష్ణు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అఖండ అప్పుడు బోయపాటి, ప్రగ్య జైస్వాల్, థమన్ లు సర్ ప్రైజ్ ఇచ్చినట్టుగా బాలకృష్ణ తో రాజమౌళి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సడన్ గా ఎంటర్ అయ్యి సర్ ప్రైజ్ ఇస్తారేమో.. ఇచ్చినా ఇవ్వొచ్చు అని అంటున్నారు. మరి బాబాయ్ బాలకృష్ణ తో అబ్బాయ్ ఎన్టీఆర్ అన్ స్టాపబుల్ షో అద్దిరిపోతుంది అంతే.. అంటూ నందమూరి ఫాన్స్ అప్పుడే పండగ చేసేసుకుంటున్నారు. మరి రామ్ చరణ్ - ఎన్టీఆర్ గనక అన్ స్టాపబుల్ షోకి వస్తే.. ఆ ఎపిసోడ్ టీఆర్పీ అమాంతంగా పెరిగిపోవడం ఖాయమంటున్నారు.

RRR Director Rajamouli to enter Balakrishna Unstoppable:

NBK Unstoppable New Guests Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ