Advertisementt

ఢీ డాన్స్ షో: లేడీ యాంకర్స్ మిస్

Thu 16th Dec 2021 01:13 PM
dhee dance show,dhee 14,sudheer,rashmi,deepika pilli,dhee season 14  ఢీ డాన్స్ షో: లేడీ యాంకర్స్ మిస్
Rashmi and Deepika Pilli Out of Dhee 14 ఢీ డాన్స్ షో: లేడీ యాంకర్స్ మిస్
Advertisement
Ads by CJ

 

బుల్లితెర మీద అతిపెద్ద రియాలిటీ షోస్ గా ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ షో 13 సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని.. ఒక్క వారం గ్యాప్ కూడా లేకుండా.. 14 వ సీజన్ లోకి ఎంటర్ అయ్యిపోయింది. ఢీ 13th సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అల్లు అర్జున్ అతిధిగా వచ్చి అదరగొట్టేసాడు. ఢీ డాన్స్ షో లో కొన్ని సీజన్ నుండి మేల్ మెంటర్, లేడీ మెంటర్స్ అంటూ డాన్స్ కన్నా ఎక్కువగా స్టేజ్ పై వాళ్ళ హడావిడి ఉంటుంది. అందులో లాస్య, రవి ల జోడి బాగా పాపులర్ అయ్యింది. తర్వాత సుధీర్ - రష్మీ జోడి స్టేజ్ పై పాపులర్ అయ్యింది. 13 వ సీజన్ వరకు సుధీర్ - రష్మిల జోడి కొన్ని సీజన్స్ కి సందడి చెయ్యగా.. ఇప్పుడు 14 వ సీజన్ నుండి సుధీర్ - రష్మీ లు కనిపించలేదు. సుధీర్ ప్లేస్ లోకి బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ వచ్చాడు.

హైపర్ ఆది పక్కన అఖిల్ సార్థక్ పంచ్ లతో బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగుపెట్టగా.. లేడీ యాంకర్స్ గా మోనాల్ గజ్జర్, దీపికా పిల్ల రాబోతున్నారు అని, ఈసారి అఖిల్ - మోనాల్ లు జోడి కలిసి కామెడీ చేస్తూ లవ్ బర్డ్స్ లా ఢీ సీజన్ 14 కి హైప్ తెస్తారని ప్రచారం జరిగింది. కానీ ఢీ 14 స్టేజ్ పై లేడీ యాంకర్స్ ఎవరూ కనిపించలేదు. వాళ్ళ ప్లేస్ లోకి నాగ శౌర్య - కేతిక శర్మలు వచ్చారు. లక్ష్య ప్రమోషన్స్ లో భాగంగా నాగ శౌర్య - కేతికలు వచ్చారు.. వాళ్ళే సందడి చేసారు. ఇక ముగ్గురు జెడ్జెస్ లో ఇద్దరే ఉన్నారు. గణేష్ మాస్టర్, ప్రియమణి ఢీ 14 జెడ్జెస్ గా ఉండగా.. పూర్ణ మిస్ అయ్యింది. ఇక ప్రదీప్ మాచిరాజు ఎప్పటిలాగే యాంకర్ గా ఢీ స్టేజ్ పై తన పంచ్ లతో సందడి చెయ్యగా.. అఖిల్ - మోనాల్ జంటని చూద్దామనుకున్న బుల్లితెర ప్రేక్షకులకి మాత్రం నిరాశ కలిగింది. 

Rashmi and Deepika Pilli Out of Dhee 14:

Three Team Leaders Sudheer, Rashmi and Deepika Pilli Out of Dhee 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ