Advertisementt

RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని గెస్ట్ లు

Thu 16th Dec 2021 02:05 PM
rrr,rrr pre release event,rajamouli,ram charan,ntr,alia bhatt,ajay devgan,dubai,mumbai,salman khan,chiranjeevi,prabhas  RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని గెస్ట్ లు
Sensational Guest For RRR Pre Release Event RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని గెస్ట్ లు
Advertisement
Ads by CJ

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలా ప్రమోట్ చేస్తే ఆయా భాషల ప్రేక్షకులని ఆర్.ఆర్.ఆర్ కనెక్ట్ అవుతుంది.. అనేలా రంగం సిద్ధం చేసుకుని.. రిలీజ్ కి నెల రోజుల ముందే ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ అంటూ హైదరాబాద్, ముంబై, బెంగుళూర్, చెన్నై లలో తన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిన్ అలియా భట్ తో హడావిడి చేసారు. ఒక్కసారిగా రాజమౌళి అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యి.. ఆర్.ఆర్.ఆర్ పై క్రేజ్ తో పాటుగా..ఐదు భాషల్లోనూ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే తన శాయశక్తులా ఆర్.ఆర్.ఆర్ ని ప్రమోట్ చేస్తాను అంటూ రాజమౌళి మరింతగా ఆసక్తిని క్రియేట్ చేసారు.

ఇక ఈ నెల మూడో వారంలో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి అండ్ మేకర్స్ దుబాయ్ లో అదిరిపోయేలా ప్లాన్ చెయ్యడమే కాదు.. ఆ ఈవెంట్ కి స్పెషల్ గా గెస్ట్ లని పిలవబోతున్నారట. దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆర్.ఆర్.ఆర్ టీం, అలాగే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ అందరూ ఈ ఈవెంట్ కి హాజరవుతారని, ఇప్పటికే రాజమౌళి తనయుడు కార్తికేయ దుబాయ్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ ఈవెంట్ కోసం నిర్మాత దానయ్య ఏకంగా 9 కోట్లు ఖర్చు పెడుతున్నారట, మెగాస్టార్ చివరంజీవి, బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారని, ప్రభాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని.. రాజమౌళి ప్రభాస్ ని పర్సనల్ గా ఆహ్వానించినట్లుగా టాక్.

ఇంతవరకు ఏ ఇండస్ట్రీలోని ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా జరగని విధంగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలు దుబాయ్ లో జరపాలనే నిర్ణయంతోనే దానయ్య మరియు రాజమౌళి బడ్జెట్ కోసం ఆలోచించకుండా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్ లో కీరవాణి లైవ్ మ్యూజిక్ తో పాటుగా స్పెషల్ డాన్స్ పెరఫార్మెన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Sensational Guest For RRR Pre Release Event:

RRR pre release power on

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ