ఎన్టీఆర్ బుల్లితెర మీద ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెర ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. రామ్ చరణ్ ఓపెనింగ్ గెస్ట్ గా షో పై అంచనాలు పెంచేసిన.. ఎన్టీఆర్ షో ఎందుకో ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. కారణం అందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ లేకపోవడమే.. అంతే బిగ్ బాస్ లా గొడవలు, కొట్లాటలు, కామెడీ, సాంగ్స్, డాన్స్ లు ఏం ఉండవు.. జస్ట్ డ్రై గా ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పడం వరకు.. మధ్య మధ్యలో ఎన్టీఆర్ తన కెరీర్, తన ఫ్యామిలీ విషయాలను కంటెస్టెంట్స్ తో పంచుకోవడం, కంటెస్టెంట్స్ మాత్రం ఎన్టీఆర్ అభిమానులం అంటూ భజన చెయ్యడం జరిగింది.
అయితే రామ్ చరణ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి 11 టీఆర్పీ రాగా.. తర్వాత మరే ఇతర ఎపిసోడ్ కి అంతగా టీఆర్పీ రాలేదు. మధ్యలో కొరటాల, రాజమౌళి, దేవిశ్రీ, థమన్, సమంత గెస్ట్ లు కూడా వచ్చారు.. సమంత ఎపిసోడ్ ఓకె ఓకె అనిపించినా.. సూపర్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా వస్తున్నాడనగానే ఆ షో పై అంచనాలు పెరిగిపోయాయి.. కానీ ఎన్టీఆర్ అండ్ మహేష్ ఎపిసోడ్ ఆ ఏ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. మహేష్ - ఎన్టీఆర్ కాంబో ఎపిసోడ్ ని ఎవరు మీలో కోటీశ్వరులు యాజమాన్యం జెమినిలో ఆదివారం రాత్రి ప్రసారం చేయగా.. దానికి మరీ లో టీఆర్పీ అంటే 5 టీఆర్పీ రావడం, చూసిన వారు.. మహేష్ - ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చెయ్యలేకపోయారంటున్నారు.
మహేష్ చిలిపి కామెడీ, ఎన్టీఆర్ కామెడీ అన్ని షో కి హైలెట్ గా నిలిచిన బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఎందుకో ఆ ఎపిసోడ్ పై అంత ఇంట్రెస్ట్ చూపించలేదని ఆ టీఆర్పీ చూస్తే తెలుస్తుంది.