Advertisementt

బిగ్ బాస్ 5: ఇదేం ట్విస్ట్ బాస్

Fri 17th Dec 2021 06:13 PM
bigg boss telugu,bigg boss,bigg boss big twist,siri hanmanth,siri eliminated  బిగ్ బాస్ 5: ఇదేం ట్విస్ట్ బాస్
Bigg Boss 5: Big Twist Siri Hanmanth Eliminated బిగ్ బాస్ 5: ఇదేం ట్విస్ట్ బాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 మరొక్క రోజులో గ్రాండ్ ఫినాలేకి వెళ్లబోతుంది.. ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం.. అది వారం సాయంత్రం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్.. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న టాప్ 5 మెంబెర్స్ లో ఒకరిని సడన్ గా ఇంటి నుండి పంపెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. టాస్క్ విషయంలో సిరి, సన్నీ బాగా గొడవపడిన తర్వాత సిరి చేసిన వంట కూడా మానస్, సన్నీలు తినకపోవడంతో సిరి నాకేమన్నా సరదానా వంట చెయ్యడానికి తినను అని ముందే చెప్పొచ్చుగా అంది.. గొడవ గొడవే తిండి తిండే అంది.. తర్వాత సడన్ గా హౌస్ మేట్స్ అంతా బాగ్స్ ప్యాక్ చేసుకుని గార్డెన్ ఏరియా కి రమ్మన్నాడు బిగ్ బాస్..

ఈ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు ఓ వ్యక్తిని ఎంపిక చెయ్యమని బిగ్ బాస్ చెప్పగానే.. మానస్ షణ్ముఖ్ పేరు చెప్పాడు. షణ్ముఖ్ సన్నీ పేరు చెప్పాడు.. తనతోనే హౌస్ లో ఎక్కువ గొడవలయ్యాయి అన్నాడు. ఇక శ్రీరామ్ ఈ ఇంట్లోకి వచ్చాక ఇంటరేక్షన్ ముఖ్యం.. అది సిరి తో నాకు అవ్వలేదు.. సో సిరి పేరు చెప్పాడు. ఇక సన్నీ షణ్ముఖ్ పేరు చెప్పగా.. సన్నీ చివరిలో అందరిలో రెండు ఓట్స్ షణ్ముఖ్ కె వచ్చాయనగానే, బిగ్ బాస్ సిరి మీరు బిగ్ బాస్ నుండి బయటికి వెళ్ళమని చెప్పగానే సిరి.. నేను వెళ్ళను బిగ్ బాస్ అంటూ ఏడుస్తుంది.. ఈలోపు బిగ్ బాస్ మెయిన్ గేట్స్ ఓపెన్ అవడంతో.. సిరి వెళ్లక తప్పలేదు.. వెళుతూ వెళుతూ ఐ మిస్ యు అని షణ్ముఖ్ ని పట్టుకుని తెగ ఏడ్చేసింది.. ఇక సిరి వెళ్ళగానే.. షణ్ముఖ్ కూడా బాగా ఏడ్చిన ప్రోమో చూసిన నెటిజెన్స్ ఫినాలే ముంది ఇదేం ట్విస్ట్ బాస్ అంటున్నారు.

Bigg Boss 5: Big Twist Siri Hanmanth Eliminated:

Bigg Boss Telugu: Big Twist Siri Hanmanth Eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ