అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో తెరకెక్కిన పుష్ప మూవీ నిన్న డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ పెరఫారెమెన్స్, అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్, ఆయన మాట్లాడిన భాష, దేవిశ్రీ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సమంత ఐటెం సాంగ్ హైలైట్స్ గా విలువగా.. సినిమా నిడివి, సెకండ్ హాఫ్, దేవిశ్రీ నేపధ్య సంగీతం, అనసూయ, సునీల్ కేరెక్టర్స్ మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.. ఇక పుష్ప పై ఉన్న హైప్, క్రేజ్ ఆ సినిమా ఓపెనింగ్స్ లో కీలక పాత్ర పోషించాయి.. పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఏరియా ల వారీగా మీకోసం..
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 11.44
సీడెడ్ - 4.20
ఉత్తరాంధ్ర - 1.80
ఈస్ట్ గోదావరి - 1.43
వెస్ట్ గోదావరి - 1.50
గుంటూరు - 2.28
కృష్ణా - 1.15
నెల్లూరు - 1.10
ఏపీ-తెలంగాణ టోటల్ - 24.90 కోట్లు
తమిళనాడు - 1.66
కర్ణాటక - 3.65
హిందీ - 1.66
ఓవర్సీస్ - 4.25
రెస్టాఫ్ ఇండియా - 1.00
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 38.49 కోట్లు